ప్రభుత్వ కొలువులు సాధించాలి

ABN , First Publish Date - 2021-07-09T04:35:07+05:30 IST

పోటీపరీక్షలు రాసే అభ్య ర్థులు తప్పకుండా ప్రభుత్వ కొలువులు సాధించా లని సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు.

ప్రభుత్వ కొలువులు సాధించాలి
మాట్లాడుతున్న సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

- సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

కాగజ్‌నగర్‌, జూలై 8: పోటీపరీక్షలు రాసే అభ్య ర్థులు తప్పకుండా ప్రభుత్వ కొలువులు సాధించా లని సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. గురువారం క్యాంపుకార్యాలయంలో పోలీసు ఉద్యో గాల కోసం ప్రిపేరవుతున్న అభ్యర్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోనేరు చారిటుబల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచితశిక్షణ కార్యక్ర మాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ శిక్షణలో నిపుణులతో చక్కటి మెళకువలతో కూడిన బోధన ఉంటుందన్నారు. సమయాన్ని సద్విని యోగం చేసుకుంటూ ప్రభుత్వ కొలువులు సాధిం చాలని సూచించారు. శిక్షణ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. 60రోజులపాటు శిక్షణ కార్యక్రమా లను కొనసాగిస్తామన్నారు. త్వరలోనే శిక్షణ ఇచ్చే తేదీని కూడా ప్రకటిస్తామన్నారు. నోటిఫికేషన్‌ వచ్చిన మరుసటి నుంచి శిక్షణ ప్రారంభించను న్నట్టు ప్రకటించారు. సమావేశంలో కోచింగ్‌ నిపు ణులు రాజ్‌కమాలకర్‌రెడ్డి, మధూకర్‌, లక్ష్మినర సింహం, కల్వలశంకర్‌, పట్టణసీఐ మోహన్‌ పాల్గొన్నారు.

ఐటీడీఏ నుంచి ఇల్లు మంజూరు చేయిస్తా..

సిర్పూర్‌(టి): ఐటీడీఏ నుంచి ఇల్లు నిర్మాణానికి రూ.3లక్షల నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే కోనేరుకోనప్ప అన్నారు. గురువారం వారంరోజుల క్రితం సిర్పూర్‌(టి)లో వనితకు చెందిన ఇల్లు షార్ట్‌సర్క్యూట్‌తో కాలిపోయింది. దీంతో బాధితురాలిని పరామర్శించారు. ఈ సంద ర్భంగా రూ.5వేల ఆర్థిక సహయంతో పాటు వంట పాత్రలు, సామగ్రి, దుస్తులను పంపిణీ చేశారు. అలాగే తహసీల్దార్‌ నదీముల్లాఖాన్‌ ప్రభుత్వం నుంచివచ్చిన రూ.5వేల ప్రొసిడింగ్‌ పత్రాన్ని అంద జేశారు. అనంతరం ఎమ్మెల్యే జక్కాపూర్‌ గ్రామంలో పల్లెప్రకృతి వనంలో మొక్కలు నాటారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌, సర్పంచ్‌ప్రభాకర్‌, కోఆప్షన్‌ సభ్యుడుకీజర్‌హుస్సేన్‌, ఉపసర్పంచ్‌ తోటమహేష్‌, శ్రీనివాస్‌, తిరుపతి, మోహీజ్‌, రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-09T04:35:07+05:30 IST