ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం

ABN , First Publish Date - 2021-07-12T06:54:26+05:30 IST

ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం అవుతాయని ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య అన్నారు.

ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం
గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న చిరుమర్తి

 ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
చిట్యాల / కేతేపల్లి, జూలై 11 :
ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం అవుతాయని ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య అన్నారు. ఆదివారం ఆయన చిట్యాల మునిసిపాలిటీలోని పదో వార్డులో చేపట్టిన పట్టణ ప్రగతిలో పాల్గొని మాట్లాడారు. పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలతో వీధులు, కాలనీలు సుందరంగా అవుతున్నాయన్నారు. ప్రతిఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని అంటువ్యాధులకు దూరంగా ఉండాలని కోరారు. మొక్కలు నాట డం మనందరి సామాజిక బాధ్యత అన్నారు. పదో వార్డును ఆదర్శం గా, అద్భుతంగా తీర్చిదిద్దుతానన్నారు. ఈ సందర్భంగా కాలనీ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వైస్‌ చైర్మన కూరెళ్ల లింగస్వా మి, కౌన్సిలర్లు సిలివేరు మౌనికశేఖర్‌, కోనేటి కృష్ణ, సింగిల్‌ విండో వైస్‌ చైర్మన మెండె సైదులు, నాయకులు తోకల నరేందర్‌రెడ్డి, జిట్ట చంద్రకాంత, దాసరి నర్సింహ పాల్గొన్నారు. అదేవిధంగా కేతేపల్లి మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన యరమాద రోహిత్‌రెడ్డికి మంజూరైన రూ.2లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును బాధితుడికి ఎమ్మెల్యే లింగయ్య అందించారు. కార్యక్రమంలో కొత్తపేట ఎంపీటీసీ బుర్రి యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్‌ / కట్టంగూర్‌ : ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్‌ఎ్‌సలో చేరుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కట్టంగూరు మండలం పిట్టంపల్లి సర్పంచ పనస సైదులు, ఎంపీటీసీ పాలడుగు హరికృష్ణ, ఇనుపాముల ఎంపీటీసీ నల్లమాద వీరమ్మ ఆధ్వర్యంలో సుమారు 100మంది ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరారు. కార్యక్రమంలో కట్టంగూరు జడ్పీటీసీ బలరాం, పార్టీ మండల అధ్యక్షుడు ఏడుకొండలు, సర్పంచలు వడ్డె సైదిరెడ్డి, పిన్నపురెడ్డి సైదిరెడ్డి, గడుసు సుధీర్‌రెడ్డి, వీరెల్లి ప్రసాద్‌, కొండ లింగస్వామి, పరుశరాములు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-12T06:54:26+05:30 IST