క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహం

ABN , First Publish Date - 2021-12-19T06:06:48+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌ అన్నారు.

క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహం
క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌

నిర్మల్‌ కల్చరల్‌, డిసెంబరు 18 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌ అన్నారు. శనివారం ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో జాతీయస్థాయి బాలికల సీనియర్లకు సాఫ్ట్‌బాల్‌ కోచింగ్‌ శిబిరం ప్రారం భించి మాట్లాడారు. ఈ నెల 25న ఇక్కడ శిక్షణ పొందిన క్రీడాకారులు అనంత పూర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. 33 జిల్లాల నుండి 22 మంది క్రీడాకారులను శిక్షణకు ఎంపిక చేసినట్లు తెలిపారు. క్రీడాకారులను ప్రోత్స హించడానికి గాను సీఎం కేసీఆర్‌ రెండు శాతం రిజర్వేషన్‌ కల్పించారన్నారు. శిక్షణ పొందిన క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో తమ సత్తా చాటాలన్నారు. కౌన్సిలర్‌ పూదరి రాజేశ్వర్‌, కార్యదర్శి కే. భోజన్న, ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి ఎం. శ్రీనివాస్‌, కబడ్డీ కార్యదర్శి వి. భూమన్న, సాఫ్ట్‌ బాల్‌ కార్యదర్శి అన్నపూర్ణ, కృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-19T06:06:48+05:30 IST