గోండ్వానా కళాకారుల అభ్యున్నతి కృషిచేస్తా
ABN , First Publish Date - 2021-09-04T04:42:32+05:30 IST
గోండ్వానా కళా కారుల అభ్యున్నతికి కృషిచేస్తానని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్‌లో రాజ్‌గోండ్ సేవాసమితి, గోండ్వానా పంచా యతీ రాయిసెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన గోండ్వానా కళాక్రాంతి దళ్ కళాకారుల అస్థిత్వ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

- కలెక్టర్ రాహుల్‌రాజ్
ఆసిఫాబాద్ రూరల్, సెప్టెంబరు 3: గోండ్వానా కళా కారుల అభ్యున్నతికి కృషిచేస్తానని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్‌లో రాజ్‌గోండ్ సేవాసమితి, గోండ్వానా పంచా యతీ రాయిసెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన గోండ్వానా కళాక్రాంతి దళ్ కళాకారుల అస్థిత్వ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాచీనకళలను పరిరక్షించు కోవాల్సిన బాధ్యతఅందరిపై ఉందన్నారు. కార్యక్ర మంలో అదనపుకలెక్టర్ వరుణ్‌రెడ్డి, డీటీడీవో మణెమ్మ, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆత్రంసక్కు యూత్‌ఫోర్స్ అధ్య క్షుడు ఆత్రం వినోద్, ఏఎంసీ వైస్ చైర్మన్ గాదవేణి మల్లేష్, గోండ్వానా కళాక్రాంతిదళ్ సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.
జూబ్లీ మార్కెట్‌ను పరిశీలించిన కలెక్టర్..
జిల్లాకేంద్రంలోని జూబ్లీమార్కెట్‌ను శుక్రవారం కలె క్టర్ రాహుల్‌రాజ్ పరిశీలించారు. మార్కెట్‌లో అసం పూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని పీఆర్ ఈఈ రాంమోహన్‌రావును అదేశించారు. అలాగే చికెన్ మార్కెట్‌నుంచి ఆర్‌ఆండ్‌బీ రోడ్డు వరకు రహదారి, కల్వర్టు కోసం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం అంచనాలు రుపొందించాలన్నారు. మురికి కాలు వలు, పార్కింగ్ స్థలం ఏర్పాటు తదితర వాటిని వెంటనే చేపట్టాలన్నారు. మార్కెట్ ఇరువైపుల గేట్లను ఏర్పాటు చేయాలని కార్యదర్శిరాజబాబును ఆదేశిం చారు. అడిషనల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డి, పీఆర్‌ఈఈ రాంమోహన్‌రావు ఉన్నారు.
కలెక్టర్‌కు వినతి పత్రం అందజేత..
సీపీఐ రాష్ట్రకమిటీ పిలుపు మేరకు ధరణి పోర్టల్‌లో లోపాలు సవరించాలని కలెక్టరేట్ ఎదుట శుక్రవారం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ మాట్లా డుతూ ధరణి పోర్టల్‌లో లోపాలు ఉన్నాయన్నారు. రైతులు తీసుకున్న భూమిపై హక్కులు లేని పరిస్థితి నెలకొందన్నారు. వెంటనే ధరణిపోర్టల్‌లో లోపాలను సవరించాలన్నారు. తిరుపతి,గణేష్, చిరంజీవి, రవీం దర్,మల్లికార్జున్,సీతారాం,సాగర్,జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.