ఘనంగా గోదా రంగనాథుల కల్యాణం

ABN , First Publish Date - 2021-01-14T03:56:50+05:30 IST

వెంకటేశ్వరస్వామి దేవాలయం ఆవ రణలో బుధవారం గోదా రంగనాథుల కల్యాణం వైభవంగా జరిగింది. గోవింద నామాలతో ఆలయం ఆవరణ మారుమో గింది. కళ్యాణం అనంతరం అన్నదానం నిర్వహించారు.

ఘనంగా గోదా రంగనాథుల కల్యాణం
నస్పూర్‌లో గోదా రంగనాధుల కల్యాణం

నస్పూర్‌, జనవరి 13: వెంకటేశ్వరస్వామి దేవాలయం ఆవ రణలో బుధవారం గోదా రంగనాథుల కల్యాణం వైభవంగా జరిగింది. గోవింద నామాలతో ఆలయం ఆవరణ మారుమో గింది. కళ్యాణం అనంతరం అన్నదానం నిర్వహించారు.  ప్రధానార్చకులు లక్ష్మాణాచార్యుల ఆధ్వర్యంలో జరిగింది.  

జన్నారం: పొన్కల్‌ వెంకటేశ్వరస్వామి ఆలయంలో  గోదాదేవి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.   సర్పంచ్‌ జక్కు భూమేష్‌, సత్తయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు. 

భీమారం: భీమారంలోని కోదండరామాలయంలో  ఆలయ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు చేకుర్తి సత్యనారాయణరెడ్డి ఆధ్వ ర్యంలో అర్చకులు తిరునంగిరి కన్నయ్య, ప్రవీణ్‌కుమార్‌లు గోదాదేవి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. 

చెన్నూరు:  పట్టణంలోని శ్రీజగన్నాధ స్వామి ఆలయంలో  గోదారంగనాధుల కల్యాణోత్సవాన్ని అర్చకులు మోహనచారి ఆధ్వర్యంలో కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.  అర్చకు లు సునీల్‌ చారీ, అనిల్‌చారీ, నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-14T03:56:50+05:30 IST