వట్టివాగు కుడి కాలువకు గండి

ABN , First Publish Date - 2021-11-22T05:17:40+05:30 IST

మండలంలోని వట్టివాగు ప్రాజెక్టు కుడి కాలువకు ఎర్రగుట్ట వద్ద గండిపడింది. శనివారం రాత్రి కాలువకు గండిపడడంతో ఎర్రగుట్ట గ్రామస్థులు ప్రాజెక్టు అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ప్రాజెక్టు డీఈ అనంద్‌కిషోర్‌, ఏఈలు జానీ, ఉదయ్‌కుమార్‌ గండిపడ్డ ప్రదేశానికి చేరుకున్నారు.

వట్టివాగు కుడి కాలువకు గండి
ఎర్రగుట్ట వద్ద వట్టివాగు కాలువకు పడిన గండి

- జలపాతాన్ని తలపిస్తున్న వృథాగా పోతున్న నీరు

ఆసిఫాబాద్‌రూరల్‌, నవంబరు 21: మండలంలోని వట్టివాగు ప్రాజెక్టు కుడి కాలువకు ఎర్రగుట్ట వద్ద గండిపడింది. శనివారం రాత్రి కాలువకు గండిపడడంతో ఎర్రగుట్ట గ్రామస్థులు ప్రాజెక్టు అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ప్రాజెక్టు డీఈ అనంద్‌కిషోర్‌, ఏఈలు జానీ, ఉదయ్‌కుమార్‌ గండిపడ్డ ప్రదేశానికి చేరుకున్నారు. గండి పడటానికి గల కారణాలను గుర్తించారు. ఈ సందర్భంగా డీఈ అనంద్‌కిషోర్‌ విలేఖరులతో మాట్లాడుతూ తుంగ, సిల్ట్‌ పేరుకు పోవడంతో గండి పడినట్లు  పేర్కొన్నారు. గండిపడ్డ చోట నుంచి వెలుతున్న ప్రాజెక్టు నీటితో పంట పొలాలకు ఎలాంటి నష్టం లేదన్నారు. ప్రాజెక్టు నీరు సమీప వాగులో కలుస్తోందన్నారు. ప్రాజెక్టు కుడి కాలువ సమీపంలో సోమవారం గండికొట్టి ప్రాజెక్టు నీటని డైవర్టు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం గండిపడ్డ చోట మరమతు పనులను ప్రారంభించి రెండు, మూడు రోజుల్లో పంట పొలాలకు నీరందిస్తామన్నారు.

Updated Date - 2021-11-22T05:17:40+05:30 IST