ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

ABN , First Publish Date - 2021-08-10T07:30:23+05:30 IST

సమస్యల పరిష్కారం కోసం ఆదివాసీలంతా సంఘ టితమవ్వాల్సిన అవసరం ఉందని ఆదివాసి గిరిజన సేవా సంఘం జిల్లా అధ్య క్షుడు తోట రమాకాంత్‌ అన్నారు.

ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
కుమురంభీం విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తున్న మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌

దిలావర్‌పూర్‌, ఆగస్టు 9 : సమస్యల పరిష్కారం కోసం ఆదివాసీలంతా సంఘ టితమవ్వాల్సిన అవసరం ఉందని ఆదివాసి గిరిజన సేవా సంఘం జిల్లా అధ్య క్షుడు తోట రమాకాంత్‌ అన్నారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్క రించుకుని సోమవారం దిలావర్‌పూర్‌ మండల కేంద్రంలో ఆదివాసి జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అరవింద్‌, ఆదివాసి నాయకులు వెంకటేష్‌, వీరప్ప, శ్రీకాంత్‌, అరుణ్‌, సాయన్న, భోజన్న, రాజు, ఎల్లప్ప, నర్సవ్వ, పూజ, భోజవ్వ, అల్లి సుజాత, సాయేం దర్‌, పెంటన్న, లింగన్నలు పాల్గొన్నారు. 

నిర్మల్‌ కల్చరల్‌, ఆగస్టు 9 : ఆదివాసీలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌ అన్నారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా సోమవారం రాజగోండ్‌ విగ్రహనికి పూలమాలలు వేశారు మారు గొండ రాము, ఆదివాసి సంఘ అధ్యక్షుడు భీంరావు, సభ్యులు పాల్గొన్నారు. 

దస్తురాబాద్‌, ఆగస్టు 9 : మండల కేంద్రంలో సోమవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆయా ఆదివాసీ సంఘాల ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కొమురంభీం చౌరస్తా వద్ద ఆదివాసీలు జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ మండలాధ్యక్షులు మెస్రం సురేందర్‌, కిరణ్‌, సీడం లక్ష్మీ, మాన్కు, తొడసం రాజు, రాజేందర్‌, మహేష్‌ తదితరులున్నారు. 

ఖానాపూర్‌ రూరల్‌, ఆగస్టు 9 : ఖానాపూర్‌ మండలంలోని గంగాయిపేటలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా జెండా ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో  టీఏజీఎస్‌ జిల్లా కార్యదర్శి తొడసం శంభు, గంగారాం, నవీన్‌, మానుకు లక్ష్మిబాయి, రూపబాయి, భరతాబాయి గిరిజనులు పాల్గొన్నారు.     

సోన్‌, ఆగస్టు 9 : మండలంలోని పాక్‌పట్ల గ్రామంలో నాయక్‌పోడ్‌ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గంగారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మార గంగారెడ్డి, నాయక్‌పోడ్‌ సేవా సంఘం నాయకులు సుంకరి ముత్యం, గంగాధర్‌, సాయన్న, గంగన్న, ముత్తన్న, రాజు, తదితరులు పాల్గొన్నారు. 

పెంబి, ఆగస్టు 9 : ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పెంబి మండల కేంద్రంలో సోమవారం జెండా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. 

ముథోల్‌, ఆగస్టు, 9 : మండలంలోని ఎడ్‌బిడ్‌ గ్రామంలో సోమవారం ఎడ్‌బిడ్‌ గ్రామ ఆదివాసీ నాయక్‌పోడ్‌ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.


Updated Date - 2021-08-10T07:30:23+05:30 IST