ఘనంగా వాల్మీకి జయంతి

ABN , First Publish Date - 2021-10-21T05:02:42+05:30 IST

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో వాల్మీకి జయం తిని బుధవారం జిల్లా వెనకబడిన తరగ తుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూఅధికారి సురేష్‌ మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి మహర్షి వాల్మీకి చేసిన సేవలు మరువలేనివని అన్నారు.

ఘనంగా వాల్మీకి జయంతి
వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేస్తున్న డీఆర్వో సురేష్‌, తదితరులు

ఆసిఫాబాద్‌, అక్టోబరు 20: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో వాల్మీకి జయం తిని బుధవారం జిల్లా వెనకబడిన తరగ తుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూఅధికారి సురేష్‌ మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి మహర్షి వాల్మీకి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమాధికారి సత్య నారాయణ, ఎంపీపీ మల్లికార్జున్‌, పీఏసీ ఎస్‌ చైర్మన్‌ అలీబీన్‌అహ్మద్‌ పాల్గొన్నారు. అలాగే పట్టణంలో గంగపుత్రసంఘం వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. రోజ్‌ గార్డెన్‌లో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి పూజలు నిర్వహించారు. మోరే శ్వర్‌, సంతోష్‌, భీంరావు, నానాజీ, సారంగ్‌, కాంగ్రెస్‌నాయకులు పాల్గొన్నారు. 

రెబ్బెన: గోలేటిలో సింగరేణి జీఎం కృష్ణ, అధికారులు వాల్మీకి చిత్రపటానికి పూల మాలలు వేసి పూజలు చేశారు. అధికారులు తిరుమల్‌రావు, రాజంద్రప్రసాద్‌, శివరామిరెడ్డి, సతీష్‌బాబు, లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు. గంగాపూర్‌ మండల పరిషత్‌ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్‌ఎంసీ చైర్మన్‌ కృష్ణవేణి, ఎంపీటీసీ హరిత పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T05:02:42+05:30 IST