ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవం

ABN , First Publish Date - 2021-10-31T07:04:52+05:30 IST

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 146వ జయంతిని పురస్కరించుకొని జిల్లా అంతటా జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.

ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవం
సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 146వ జయంతిని పురస్కరించుకొని జిల్లా అంతటా జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పటేల్‌ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 

సోన్‌, అక్టోబరు 30 : ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 146వ జయంతిని పురస్కరించుకొని సోన్‌ మండల కేంద్రం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం రాష్ర్టీయ ఏక్తాదివస్‌ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్‌పటేల్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జాతీయ సమగ్రత లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని, విద్యార్థి దశనుంచే దేశభక్తి, సేవాగుణాన్ని అలవర్చుకోవాలని ప్రధానోపాధ్యాయుడు గజ్జారాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మెరుగు శ్రీనివాస్‌రెడ్డి, అమరవేణి రవీందర్‌గౌడ్‌, రాపర్తి అశోక్‌కుమార్‌, తోడిశెట్టి రవికాంత్‌, కస్తూరి భీమేశ్వర్‌, కొండూరు పోతన్న, సురేఖ, సంగీత, సుమతి, స్వాతి, తదితరులు పాల్గొన్నారు. 

దిలావర్‌పూర్‌ : మండలంలోని సాంగ్వి ప్రాథమికోన్నత పాఠశాల, గుండం పల్లి ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల చేత సమైక్యత ప్రతిజ్ఞ చేయిం చారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంలు కే. సుదర్శన్‌, శంకర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

లోకేశ్వరం : ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 146వ జయంతిని పురస్కరించుకొని ఎంపీపీఎస్‌ రాజురాలో శనివారం ముంద స్తుగా రాష్ర్టీయ ఏక్తాదివస్‌ ఘనంగా నిర్వహించారు. ముందుగా సర్దార్‌ పటేల్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జాతీయ సమగ్రత లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని, విద్యార్థి దశ నుంచే దేశభక్తి, సేవ గుణాన్ని అలవర్చుకోవాలని ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు జి.రాజేశ్వర్‌ అన్నారు. అనంతరం విద్యార్థులతో ఏక్తాదివస్‌ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్య క్రమంలో విద్యా వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. 

తానూర్‌ : భారత ప్రథమ ఉప ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి సర్ధార్‌ వల్లభాయిపటేల్‌ జయంతిని పురస్కరించుకొని తానూర్‌ ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ సమైక్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మల్లన్న మాట్లాడుతూ పటేల్‌ న్యాయవాద విద్య చదివి  అడ్వకేట్‌గా వృత్తిని చేస్తూ స్వాతంత్య్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొని ప్రజలకు, రైతలను చైతన్య పరిచారని పేర్కొన్నారు. సుమారు 500 పై చిలుకు సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి ఉక్కుమనిషిగా పేరొందా డని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేందర్‌రాజు, సంజయ్‌కుమార్‌, గంగాధర్‌, రమేశ్‌, నరహరి, అలేఖ్య, చిన్నన్న, శ్యామ్‌, రవీందర్‌, ఉపాధ్యాయులు విద్యా ర్థులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-31T07:04:52+05:30 IST