ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం

ABN , First Publish Date - 2021-11-01T05:06:16+05:30 IST

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా జాతీయఐక్యతా దినోత్స వాన్ని ఆదివారం పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా నిర్వహించారు.

ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం
ఆసిఫాబాద్‌లో మాట్లాడుతున్న అడిషనల్‌ ఎస్పీ సురేష్‌

ఆసిఫాబాద్‌, అక్టోబరు 31: సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా జాతీయఐక్యతా దినోత్స వాన్ని ఆదివారం పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా అడిషనల్‌ ఎస్పీ సురే ష్‌కుమార్‌ మాట్లాడుతూ భారత తొలిఉప ప్రధానిగా, హోం మంత్రిగా సర్దార్‌వల్లభాయ్‌ పటేల్‌ దేశానికి ఎనలేనిసేవలు చేశారని కొనియాడారు. కార్యక్రమం లో ఆర్‌ఐ అడ్మిన్‌శేఖర్‌బాబు,ఆర్‌ఎస్సైలు, స్పెషల్‌పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

రెబ్బెన: మండలకేంద్రంలో సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చిత్రపటానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు జేబీ పౌడెల్‌, నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి ఆయనచేసిన సేవలను కొనియా డారు. కార్యక్రమంలో సుదర్శణ్‌, చక్రపాణి, ఆంజనే యులుగౌడ్‌, తిరుపతి, రాజేష్‌, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే సింగరేణి అధికారులు కైరిగూడ ఒపెన్‌ కాస్టుపై జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. అంతకు ముందు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. మేనేజర్‌ ప్రవీణ్‌, అధికారులు మధుసుదన్‌, శ్రీనివాస్‌, చంద్ర శేఖర్‌, వెంకటేశ్వర్లు, భాస్కరచారి పాల్గొన్నారు.

Updated Date - 2021-11-01T05:06:16+05:30 IST