ఘనంగా దమ్మ చక్రపరివర్తన్‌ దివస్‌

ABN , First Publish Date - 2021-10-30T04:01:14+05:30 IST

ఆసిఫాబాద్‌ పట్టణంలో శుక్రవారం దమ్మ చక్రపరివర్తన దివస్‌ను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్‌ పర్సన్‌ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు హాజరయ్యారు.

ఘనంగా దమ్మ చక్రపరివర్తన్‌ దివస్‌
కార్యక్రమంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌ పర్సన్‌ కోవ లక్ష్మి

ఆసిఫాబాద్‌రూరల్‌, అక్టోబరు 29: ఆసిఫాబాద్‌ పట్టణంలో శుక్రవారం దమ్మ చక్రపరివర్తన దివస్‌ను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్‌ పర్సన్‌ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా లుంబినీ దీక్ష భూమి ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం కోవ లక్ష్మి మాట్లాడుతూ బుద్ధుడి బోధనలు సకల మానవాళి జీవితాలకు శాంతిని అందిస్తాయని చెప్పారు. ప్రజలంతా బుద్ధుడి బోధనలు అవలంబించాలని సూంచిచారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు, ఎంపీపీ మల్లికార్జున్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ అలీబీన్‌ అహ్మద్‌, మాజీ ఎంపీపీ బాలేష్‌ఔడ్‌, మధుబావర్కర్‌, అంబేద్కర్‌ సెంటర్‌ కమిటీ అధ్యక్షుడు అశోక్‌ మహోర్కర్‌, ప్రధాన కార్యదర్శి ఆత్మారావ్‌, శ్యాంరావు, పుల్లయ్య, తుకారాం, బాపురావు, సంతోష్‌, చైత న్య, హేమంత్‌, బంటి, రాజేశ్వర్‌, మారుతి పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T04:01:14+05:30 IST