క్రీడాస్ఫూర్తి అలవర్చుకోవాలి

ABN , First Publish Date - 2021-01-14T05:26:07+05:30 IST

క్రీడాకారులు క్రీడాస్ఫూర్తి అలవర్చుకోవాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

క్రీడాస్ఫూర్తి అలవర్చుకోవాలి
వాలీబాల్‌ పోటీల ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న మంత్రి

మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్‌ కల్చరల్‌, జనవరి 13 : క్రీడాకారులు క్రీడాస్ఫూర్తి అలవర్చుకోవాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం బ్రహ్మపురి రధాల గుడిలో రిటైర్డ్‌ ఎక్సైజ్‌ అధికారి జాప పోశెట్టి స్మారక వాలీబాల్‌ పోటీలు మంత్రి ప్రారంభించారు. క్రీడలు శరీర ధారుడ్యానికి మానసిక ఉల్లాసానికి దోహద పడతాయన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ జి. ఈశ్వర్‌, గ్రంథాలయ చైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌, కౌన్సిలర్లు లక్కాకుల నరహరి, పూదరి రాజేశ్వర్‌, వేణు, ఎస్పీ రాజు, ఎడపల్లి నరేందర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-14T05:26:07+05:30 IST