దీప కాంతులతో విరాజిల్లిన గండి రామన్న శివాలయం

ABN , First Publish Date - 2021-11-26T06:59:14+05:30 IST

కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్మల్‌ గండి రామన్న ఆలయ ప్రాంగణంలో నెలకొన్న శివాలయం కార్తీక దీపాలతో విరా జిల్లింది.

దీప కాంతులతో విరాజిల్లిన గండి రామన్న శివాలయం
కార్తీక దీపోత్సవంలో మహిళలు అంగరంగ వైభవంగా కార్తీక దీపోత్సవం

నిర్మల్‌ కల్చరల్‌, నవంబరు 25 : కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్మల్‌ గండి రామన్న ఆలయ ప్రాంగణంలో నెలకొన్న శివాలయం కార్తీక దీపాలతో విరా జిల్లింది. గురువారం సాయంత్రం సాయిదీక్షసేవా సమితి ఆధ్వర్యంలో సింగిల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ లక్కడి జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో 11,116 దీపాలు వెలిగించి మహిళలు తమ భక్తిని చాటుకున్నారు. దీప కాంతులతో ఆలయం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుండి కార్తీక దీపాలు వెలిగించేందుకు అశేషసంఖ్యలో మహిళలు హాజరయ్యారు. శివాల యంలో కార్తీక దీపం వెలిగిస్తే సకల పాపాలు హరిస్తాయన్న భక్తి భావనతో మహిళలు దీపోత్సవంలో పాల్గొని కార్తీక దీపోత్సవం విజయవంతం చేశారు. 

Updated Date - 2021-11-26T06:59:14+05:30 IST