రామాలయ నిర్మాణానికి నిధుల సేకరణ

ABN , First Publish Date - 2021-01-21T04:03:06+05:30 IST

జిల్లాలోని పలు చోట్ల ఆయోధ్యలో రామాలయ నిర్మాణానికి బుధవారం నిధులు సేకరించారు.

రామాలయ నిర్మాణానికి నిధుల సేకరణ
సభ్యులకు విరాళం అందజేస్తున్న ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు

ఆసిఫాబాద్‌ రూరల్‌, జనవరి 20: జిల్లాలోని పలు చోట్ల ఆయోధ్యలో రామాలయ నిర్మాణానికి బుధవారం  నిధులు సేకరించారు. జిల్లా కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించి విరాళాల సేకరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆత్రం సక్కును సభ్యులు కలవగా ఆయన తన వంతుగా రూ.11 వేలు అందజేసి నిధు ల సేకరణను ప్రారంభించారు. కార్యక్రమంలో సభ్యులు గందం శ్రీనివాస్‌, కోటేశ్వర్‌రావు, వెంకన్న, ప్రబోథ్‌, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు. 

తిర్యాణి: మండల కేంద్రంలో రామజన్మ భూమి తీర్థక్షేత్ర సభ్యులు విరాళాల సేకరణ ప్రారంభించారు.  కార్యక్రమంలో సభ్యులు హనుమండ్ల శంకర్‌, తాళ్ల శ్రీనివాస్‌గౌడ్‌, హన్మంతరావు, లచ్చు, రమేష్‌గౌడ్‌, రామన్న, భీమన్న, కోటయ్య, తిరుపతి, మీరాబాయి తదితరులు పాల్గొన్నారు. 

బెజ్జూరు: బెజ్జూరు మండలంలోని ఎల్కపల్లి గ్రామంలో బుధవారం రామ మందిర నిర్మాణం కోసం దళిత వాడలో శ్రీరామజ న్మభూమి తీర్థ క్షేత్ర ఆధ్వర్యంలో విరాళాలు సేకరించారు. అంతకు ముందు శివాలయం లో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సుధాకర్‌గౌడ్‌, తిరుపతి, భాస్కర్‌ రాజు, నరేందర్‌గౌడ్‌, పద్మాకర్‌, నీలేష్‌, సమ్మన్న, లక్ష్మణ్‌, నాగేష్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

చింతలమానేపల్లి: మండల కేంద్రంతో పాటు కర్జేల్లి గ్రామంలో రామ మందిర నిర్మాణం కోసం విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ఎంపీపీ డబ్బుల నానయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రామజన్మ భూమి తీర్థ క్షేత్ర నిధి సేకరణ సంయోజక్‌ శ్రీనివాస్‌, సభ్యులు రాజన్న, మారుతి, శంకర్‌, దేవాజీ తదితరులు పాల్గొన్నారు. 

లింగాపూర్‌: మండల కేంద్రంలోని గాంధీ చౌక్‌లో బీజేపీ మండలాధ్యక్షుడు రాథోడ్‌ రమేష్‌ ఆధ్వర్యంలో రామ మందిర నిర్మాణం కోసం విరాళాలు సేకరించారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు.  కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-21T04:03:06+05:30 IST