ప్రభుత్వ వైఫల్యం వల్లే భైంసాలో తరచూ అల్లర్లు

ABN , First Publish Date - 2021-03-21T05:47:53+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే భైంసాలో మాటిమాటికి అల్లర్లు చోటుచేసుకుంటున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యన్నగారి భూమయ్య అన్నారు.

ప్రభుత్వ వైఫల్యం వల్లే  భైంసాలో తరచూ అల్లర్లు
రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే భైంసాలో మాటిమాటికి అల్లర్లు చోటుచేసుకుంటున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యన్నగారి భూమయ్య

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యన్నగారి భూమయ్య

కుభీర్‌, మార్చి 20 : రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే భైంసాలో మాటిమాటికి అల్లర్లు చోటుచేసుకుంటున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యన్నగారి భూమయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. భైంసాలో పోలీసులు ఒకే వర్గానికి వత్తాసు పలుకుతూ హిందువులపై దాడులు జరిగినా సరైన చర్యలు తీసుకోకపోవడం వలన ఘర్షణలు పునరావృతం అవుతున్నాయన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాలనలో బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక నిధులు నియమకాలు, ఇంటింటికో ఉద్యోగం ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్‌ పాలన లోపాలను ప్రజలు గుర్తిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో గుణపాటం చెబుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రవిపాండే గోపాల్‌సర్డా, నారాయణ్‌రెడ్డి పుప్పల లింగం, డా. పోశెట్టి, తదితరులున్నారు. 


Updated Date - 2021-03-21T05:47:53+05:30 IST