బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ బలవన్మరణం

ABN , First Publish Date - 2021-02-05T05:42:52+05:30 IST

మండలంలోని వెల్సరిరాంపూర్‌కు చెందిన బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ మారుతి (32) బుధవారం అర్ధరాత్రి పురుగుల తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ బలవన్మరణం

భీంపూర్‌, ఫిబ్రవరి 4 : మండలంలోని వెల్సరిరాంపూర్‌కు చెందిన బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ మారుతి (32) బుధవారం అర్ధరాత్రి పురుగుల తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. వెల్సరిరాంపూర్‌కు గ్రామానికి చెందిన మారుతి బీఎస్‌ఎఫ్‌ జవాన్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి అదే గ్రామానికి చెందిన ఒంటరి మహిళ (42)తో వివాహేతర సంబంధం ఉంది. అయితే ఇటీవలే స్వగ్రామానికి తిరిగొచ్చిన మారుతికి కుటుంబ సభ్యులు పెళ్లి చేయాలని నిర్ణయించుకుని.. సంబంధాలు చూడసాగారు. విషయం తెలుసుకున్న సదరు మహిళ.. తననే పెళ్లి చేసుకోవాలని, వేరే యువతిని పెళ్లి చేసుకుంటే పోలీసు స్టేషన్‌లో కేసు పెడతానని హెచ్చరించింది. దీంతో మనస్తాపానికి గురైన మారుతి బుధవారం రాత్రి తనింట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు ఎస్సై మహ్మద్‌ ఆరీఫ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-02-05T05:42:52+05:30 IST