వరద బీభత్సం

ABN , First Publish Date - 2021-07-24T06:50:13+05:30 IST

నాలుగు రోజులుగా వరుసపెట్టి మరి దంచికొడుతున్న వర్షాలకు వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. రుతుపవనాలకు తోడు వాయువ్య బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటల వ్యవధిలోనే వరదలు ఉధృతి పెరగడంతో అంతా అతలాకుతలమైంది.

వరద బీభత్సం

జిల్లాలో 15వేల 380 ఎకరాల్లో పంట నష్టం

తీవ్రంగా దెబ్బతిన్న పత్తి, సోయా

కోతకు గురైన గ్రామీణ రోడ్లు, కల్వర్టులు

అధిక వర్షాలతో అన్నదాతల ఆందోళన

ఆదిలాబాద్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): నాలుగు రోజులుగా వరుసపెట్టి మరి దంచికొడుతున్న వర్షాలకు వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. రుతుపవనాలకు తోడు వాయువ్య బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటల వ్యవధిలోనే వరదలు ఉధృతి పెరగడంతో అంతా అతలాకుతలమైంది. ప్రధానంగా బోథ్‌, నేరడిగొండ, ఇచ్చోడ, బజార్‌హత్నూర్‌ మండలాలతో పాటు ఏజెన్సీ మండలాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఆదిలాబాద్‌రూరల్‌, భీంపూర్‌, తలమడుగు, తాంసి, మావల మండలాల్లో అత్య ల్ప వర్షపాతం నమోదైంది. గురువారం ఉదయం 8గంటల నుంచి శుక్రవారం ఉదయం 8గంటల వరకు జిల్లాలో 75.4మి.మీల సగటు వర్షపాతం కురిసింది. అత్యధికంగా ఉట్నూర్‌ మండలంలో 140 మి.మీలు, బోథ్‌లో 131మి.మీలు, నేరడిగొండలో 121 మి.మీలు, నార్నూర్‌లో 130.4మి.మీల వర్షం కురిసింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 450.8మి.మీల వర్షం కురియాల్సి ఉండగా 824.8మి.మీల అధిక వర్షపాతం నమోదైంది. జిల్లా సరిహద్దులో ప్రవహిస్తున్న పెన్‌గంగా నదిలో క్రమంగా వరద నీటి ఉధృతి పెరుగుతోంది. ఒకవేళ పెన్‌గంగాకు వరద నీటి ప్రవాహం మరింత పెరిగితే జైనథ్‌, బేల మండలాల్లో నది పరివాహాక ప్రాంతాల గ్రామాల్లో పంటలు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ ఏడు జిల్లా వ్యా ప్తంగా 5లక్షల 72వేల 381 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేశారు. ఇందులో అధికంగా పత్తి, సోయా, కంది పంటలనే ఎక్కువగా సాగు చేశారు. అప్పుచేసి పంటలను సాగు చేస్తున్న కురుస్తున్న భారీ వర్షాలకు అన్నదా తలు ఆందోళనకు గురవుతున్నారు.

నేలకొరిగిన పంటలు..

వరదల ఉధృతికి పత్తి, సోయా, కంది ఇతర పంటలు నేలకొరిగాయి. జిల్లా వ్యాప్తంగా 15 వేల 380ఎకరాలలో  పంట నష్టం జరగినట్లు వ్యవసాయ శాఖాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ముఖ్యంగా నార్నూర్‌, ఉట్నూర్‌, బోథ్‌, నేరడిగొండ, బజార్‌హత్నూర్‌, సిరికొండ, ఇచ్చోడ మండలాల్లో ఎక్కువగా పంట నష్టం జరిగినట్లు గుర్తించారు. పత్తి పంట 9వేల600 ఎకరాలు, సోయా పంట 4170 ఎకరాలు, కంది 1610 ఎకరాలు నష్టం జరిగినట్లు నివేదికలు రూపొందించారు. అయితే వ్యవసాయ శాఖాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించకుండానే పంటల అంచనా వేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కువగా పత్తిపంట నీట మునగడంతో నలుపుబారీ పోయి నేలపాలయ్యే విధంగా కనిపిస్తోంది. పంట చేన్లు భారీగా కోతకు గురి కావడంతో పంటలను ఇసుక మేటలు కప్పేశాయి. కోతకు గురైన సాగుభూములను చదును చేసేందుకు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుందని ఆవేదనకు లోనవుతున్నారు. కళ్ల ముందే వరద నీటిలో పంట మునిగిపోవడంతో అన్నదాతలుకన్నీరు పెట్టుకుంటున్నారు.

కొట్టుకుపోయిన కల్వర్టులు..

భారీ వరద నీటికి జిల్లాలోని పలు గ్రామాల రోడ్లపై కల్వర్టులు కొట్టుకు పో యి నేలమట్టమయ్యాయి. పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలోని రోడ్ల పై పది కల్వర్టులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బేల మండలంలో పెంబిగూడ, దౌనా, నేరడిగొండ మండలంలో మాదాపూర్‌, కుంటాల, బొందిడి, బోరిగామ్‌, గర్భతాండ, సిరికొండ మండలంలో నారాయణ్‌పూర్‌ గ్రామాల సమీపంలోని కల్వర్టులు కోతకు గురైనట్లు అధికారులు గుర్తించారు. వీటి మరమ్మతులకు 2.61కోట్ల రూపాయల అంచనా వేశారు. అలాగే ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలోని నార్నూర్‌ మండలంలో రాజులగూడ, గాదిగూడ మండలంలో తోయగూడ, చిట్టగూడ గ్రామాలకు వెళ్లే రోడ్లపైన ఉన్న కల్వర్టులు కొట్టుకు పోయాయి. అలాగే బోథ్‌ నుంచి అడెల్లి వెళ్లే రోడ్డుపై ధన్నూర్‌ వద్ద 150మీటర్ల బీటీ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. వీటికి  సుమారుగా రూ.50లక్షలు అవసరమని అధికారులు అంచనా వేశా రు. ఇప్ప టికే రోడ్లు, కల్వర్టులు ధ్వంసం కావడంతో 34 గ్రా మాలకు రాకపోకలను నిలిపి వే శారు. మరిన్ని లోలెవల్‌ వంతెనలు ప్ర మాదకరంగానే కనిపిస్తున్నాయి.వరద బీభత్సం జిల్లాలో 15వేల 380

Updated Date - 2021-07-24T06:50:13+05:30 IST