పండుగలు సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీక

ABN , First Publish Date - 2021-11-09T06:58:00+05:30 IST

జిల్లా వ్యాప్తంగా నాగులచవితి, కార్తీక మాసం మొదటి సోమ వారం పండుగలను ఘనంగా నిర్వహించారు.

పండుగలు సంస్కృతీసంప్రదాయాలకు  ప్రతీక
హుజూర్‌నగర్‌లో నాగులచవితి పూజల్లో పాల్గొన్న భక్తులు

 జిల్లా వ్యాప్తంగా నాగులచవితి, కార్తీక మాసం మొదటి  సోమ వారం పండుగలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంరే శివాలయాల్లో, పుట్టల వద్ద ప్రత్యే పూజల్లో ప్రజలు పాల్గొ న్నారు. పుట్టల్లో పాలుపోసి, నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్ర మాల్లో  భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.  

అనంతగిరి: పండుగలు సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీక అని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. అనంతగిరి నాగులచవితి, కార్తీక మాసం సందర్భంగా మండల కేంద్రంలో రఘునాథరామ లింగేశ్వరస్వామి దేవాల యంలో  ప్రత్యేక పూజల్లో పాల్గొని మాట్లాడారు. అథ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆలయ చైర్మన్‌ గోళ్ళ వీరబాబు  ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బుర్ర సుధారాణి, కోదాడ ఎంపీపీ చింత కవితరాధారెడ్డి, ఎంపీపీ చుండూరు వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ ఉమ పాల్గొన్నారు. 

చిలుకూరు: మండలంలోని కొండాపురం, బేతవోలు, నారాయణగూడెం, చెన్నారిగూడెం, పోలేనిగూడెం గ్రామాల్లో పండుగను నిర్వహించారు.  

హుజూర్‌నగర్‌: పట్టణంలోని శివాలయం, నాగేంద్రస్వామి దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  పట్టణంలోని శ్రీపార్వతీ సహిత భీమలింగేశ్వరస్వామికి  అభిషేకాలు చేశారు. 

నేరేడుచర్ల: మండలంలోని సోమప్ప సోమేశ్వర దేవాలయం, నేరేడుచర్ల శివాలయం, దిర్శించర్ల శివాలయంలో ఉన్న పుట్టల వద్ద  భక్తులు పాలు పోసి పూజల్లో పాల్గొన్నారు.  

సూర్యాపేట కల్చరల్‌:  కార్తీక మాసం మొదటి సోమవారం, నాగుల చవితి సందర్భంగా  సూర్యాపేటలోని  పలు దేవాలయా ల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సైనికపురి కాలనిలోని పాత శివాలయం, తహసీల్ధార్‌ కార్యాలయం రోడ్డులోని అన్నపూర్ణ సహిత విశ్వనాథ స్వామి దేవాలయంలో, రామలింగేశ్వరస్వామి దేవాలయంలో, శ్రీసంతోషిమాత దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.  పాత శివాలయం లో శివలింగానికి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ ఉప్పల లలితాదేవి క్షీరాభిషేకం చేశారు.  సంతోషిమాత దేవాలయంలో సత్యనారాయణస్వామి వ్రతాన్ని నిర్వహించారు. 

మఠంపల్లి: మండలంలోని మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంతో పాటు మఠంపల్లి, బక్కమంతులగూడెం, పెదవీడు, యాతవాకిళ్ళ, హను మంతులగూడెం, రఘునాథపాలెం, వర్ధాపురం, చౌటపల్లి తదితర గ్రామా ల్లోని ఆల యాల్లో భక్తులు నాగ దేవతలకు క్షీరాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు మట్టపలి ్లరావు, విజయ్‌ కుమార్‌, ఈవో నవీన్‌ పాల్గొన్నారు. 

కోదాడ: పట్టణంలోని గుంటిరఘునాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సీఈవో వెంకటచలపతి, చైర్మన్‌ గుడుగుంట్ల రంగయ్య, భక్తులు పాల్గొన్నారు. 

మేళ్లచెర్వు: స్థానిక స్వయంభు శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో పరమశివునికి చందనంతో అభిషేకాలు విశేష అర్చనలు నిర్వహించారు. అనంతరం రకరకాల పూలతో  అలంకరించి పూజలు చేశారు. ఈ కార్యక్ర మంలో అర్చకులు శివవిష్ణువర్ధన్‌శర్మ, ధనుంజయశర్మ  పాల్గొన్నారు. 

హుజూర్‌నగర్‌: పట్టణంలోని శివాలయంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి అప్పల నర్సింహమూర్తి సోమవారం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఈవో కొండారెడ్డి, ఓరుగంటి నాగేశ్వరరావు, కీతా మల్లికార్జున్‌, సుబ్రహ్మణ్యం, సతీష్‌, సురేష్‌, పాల్గొన్నారు. 

మోతె: మండలంలోని తుమ్మలపల్లి, నామవరం, కూడలి, సర్వారం గ్రామాల్లో ఉన్న శివాలయాల వద్ద దీపాలను వెలిగించారు.

కోదాడ రూరల్‌: కోదాడ మండలం తమ్మర గ్రామంలో సుబ్రహ్మణ్యస్వామి కల్యా ణాన్ని వైభ వంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్‌, మునిసిపల్‌ చైర్మన్‌ వనపర్తి శిరీష, మార్కెట్‌ చైర్మన్‌ సుధారాణి, ఎంపిపి కవితారెడ్డి, జడ్పీటీసీ కృష్ణకుమారి, వైస్‌ ఎంపీపీ మల్లెల రాణి సర్పంచ్‌ ముత్తవరపు ఆంధ్రజ్యోతి, సింగిల్‌ విండో చైర్మన్‌ రమేష్‌, సింగిల్‌ విండో డైరెక్టర్‌ కమతం వెంకటయ్య, కోదాటి క్రిష్ణయ్య పాల్గొన్నారు. 
Updated Date - 2021-11-09T06:58:00+05:30 IST