‘రైతులు కస్టమర్‌ చార్జీలను చెల్లించాలి’

ABN , First Publish Date - 2021-01-20T06:33:29+05:30 IST

రైతులు కస్టమర్‌ చార్జీలను తప్పక చెల్లించాలని ఏపీ ట్రాన్స్‌కో ఎస్‌ఈ చౌహన్‌ అన్నారు.

‘రైతులు కస్టమర్‌ చార్జీలను చెల్లించాలి’
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌ఈ చౌహన్‌

కడెం, జనవరి 19 : రైతులు కస్టమర్‌ చార్జీలను తప్పక చెల్లించాలని ఏపీ ట్రాన్స్‌కో ఎస్‌ఈ చౌహన్‌ అన్నారు. కడెం మండల కేంద్రంలోని హరిత రిసార్ట్‌లో కడెం, ఖానాపూర్‌, మామడ, పెంబి, దస్తూరాబాద్‌ మండలాల విద్యుత్‌ సిబ్బందితో ఎస్‌ఈ చౌహన్‌ సమీక్షా సమావేశం నిర్వి హంచారు. రైతులు విద్యుత్‌ కస్టమర్‌ చార్జీలను చెల్లించాలని అన్నారు. ఈ నెల 25వ తేదీలోగా రైతులు కస్టమర్‌ చార్జీలను చెల్లించేలా సిబ్బంది పని చేయాలన్నారు. అలాగే అక్రమ విద్యుత్‌ కనెక్షన్‌ లేకుండా చూడాలన్నారు. అనం తరం గత నెల బిల్లులకు సంబంధించి టార్గెట్స్‌, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల పనితీరు ఆయా సమస్యల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో డీఈ మధుసూదన్‌, ఏడీఈ ఈదన్న, ఏఏవో సురేష్‌, ఏఈలు సుమన్‌, శ్రీనివాస్‌, లచ్చన్న, చంద్రమౌళి, సాయికిరణ్‌లు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-20T06:33:29+05:30 IST