రైతులు పొలాల్లో తిరగొద్దు
ABN , First Publish Date - 2021-07-24T06:50:57+05:30 IST
మండలంలో వర్షాలు కరుస్తున్న సమయంలో రైతులు పొలాల్లో తిరుగవద్దని మండల వ్యవసాయాధికారి ఎ.వివేక్ తెలిపారు. శుక్రవారం మండలంలోని దీపాయిగూడ, కాప్రీ, కరంజి, ఆనంద్‌పూర్, కామాయి, డొల్లార తదితర గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి రైతులకు సలహాలు సూచనలు అందించారు

జైనథ్, జూలై 23: మండలంలో వర్షాలు కరుస్తున్న సమయంలో రైతులు పొలాల్లో తిరుగవద్దని మండల వ్యవసాయాధికారి ఎ.వివేక్ తెలిపారు. శుక్రవారం మండలంలోని దీపాయిగూడ, కాప్రీ, కరంజి, ఆనంద్‌పూర్, కామాయి, డొల్లార తదితర గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి రైతులకు సలహాలు సూచనలు అందించారు. ప్రస్తుత వర్షాకాలంలో విద్యుత్ స్తంభాలు, వైర్లు పొలాల్లో పడే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పత్తి పంటలో విల్ట్‌కి కాఫర్ ఆక్సిక్లోరైడ్ 600 గ్రాములో ప్లాంటామైసిన్‌ను కలిపి పిచికారి చేయాలన్నారు. ఆయన వెంట వ్యవసాయ విస్తరణ అధికారులున్నారు.
పంటల పరిశీలన
నేరడిగొండ, జూలై 23: మండలంలోని కుమా రీ, బుగ్గారాం, సావర్‌గాం, వాంకిడి, వడూర్, వా గ్దారి తదితర గ్రామాల్లో నీటమునిగిన పంటలను మండల వ్యవసాయాధికారి బిర్రు భాస్కర్ వ్యవ సాయ విస్తరణ అధికారులతో కలిసి పరిశీలిం చారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రైతులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. శుక్ర వారం వర్షం తగ్గిన తర్వాత 200 లీటర్ల నీటికి 600 గ్రాముల కాపర్ ఆక్షిక్లోరైడ్ 20గ్రాముల ప్లాంటా మైసిన్ మిశ్రమాన్ని మొక్క వేరు భాగం లో పోయాలన్నారు. మూడు రోజుల తర్వాత లీటరు నీటికి 10 గ్రాముల 19;19;19; అలాగే 4 గ్రాముల ఫార్ములా 4ను కలిపి పిచికారి చేయా లన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు జైపాల్, గజేందర్, వసుధ, స్వర్ణలత, వసంత పాల్గొన్నారు.
చేపల వేటకు వెళ్లొద్దు
భీంపూర్, జూలై 23: భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు చెరువులు, వాగులు, పెన్‌గంగాలో చేపల వేటకు వెళ్లరాదని వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న సూచించారు. శుక్రవారం పిప్పల్‌కోటిలో మత్స్యకారులతో మాట్లాడారు. రైతులు సైతం పంట పొలాలకు వెళ్లరాదన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఆదిలాబాద్, జూలై23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముప్పు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ము న్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ అన్నారు. శుక్రవారం 28, 29 వార్డుల్లో పర్యటించారు. కాలనీ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఖానాపూర్ చెరువు పరిసర ప్రాంతాల్లోని ఇండ్లలోకి వర్షపు నీరు రావడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జహీర్‌రంజాని తదితరులున్నారు.