రైతువేదికలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-02-09T04:37:42+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం రైతుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన రైతువేదికలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు.

రైతువేదికలను సద్వినియోగం చేసుకోవాలి
లక్షెట్టిపేట మండలంలోని సూరారం రైతువేదికలో మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయశాఖ అధికారి

  లక్షెట్టిపేట రూరల్‌, ఫిబ్రవరి 8: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన రైతువేదికలను  సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. సూరారం రైతు వేదికలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు వేదికల ద్వారా గ్రామాల్లో రైతులు ఏ విధమైన పంటలు పండించాలి,  తెగుళ్ళ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశా లపై వ్యవసాయశాఖ అధికారులు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. చల్లంపేట, రంగపేట గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి చీడ పురుగుల నివారణకు తీసుకోవాల్సి జాగ్రత్తపై అవగాహన కల్పించారు. మండల రైతు సమితి అధ్యక్షుడు నడిమెట్ల రాజన్న, ఏవో సీ.హెచ్‌.ప్రభాకర్‌,సర్పంచ్‌ శంకరయ్య, ఉమేష్‌,ప్రసన్న,మాన్యూష,మౌనిక  పాల్గొన్నారు.

మంచిర్యాల : రైతుల సమస్యలను పరిష్కరించేం దుకు అన్ని గ్రామాల్లో రైతువేదికలను ప్రభుత్వం నిర్మిం చిందని, వాటిని రైతులు వినియోగించుకోవాలని బెల్లంపల్లి మండల వ్యవసాయ అధికారి సుద్దాల ప్రేం కుమార్‌ తెలిపారు. గురిజాల రోడ్‌లో నిర్మించిన రైతు వేదికలో సోమవారం రైతులతో సమావేశం నిర్వహిం చారు. రైతులు ఏదైనా సమస్య ఉంటే ఏడీఏ కార్యాల యాల వద్దకు రావద్దని, రైతువేదికల్లోనే ఏఈవోలు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఏఈవో శ్రీనివాస్‌, తాళ్లగురిజాల, పెర్కపల్లి, బట్వాన్‌పల్లి గ్రామాల రైతులు పాల్గొన్నారు.  

శ్రీరాంపూర్‌ : రైతువేదికలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని చెన్నూర్‌ ఏడీఏ బాపు పేర్కొన్నారు. సోమవారం ఇందారం రైతువేదికలో ఇందారం, రామా రావుపేట, టేకుమట్ల, ఎల్కంటి గ్రామాలకు చెందిన రైతులతో సమావేశం నిర్వహించారు. వారానికి రెండు సార్లు రైతులతో సమావేశం ఉంటుందని, రైతులు తప్పక హాజరుకావాలని సూచించారు. పంటల సాగు పై వచ్చే అనుమానాలు అధికారులతో నివృత్తి చేసుకో వాలన్నారు. మండల వ్యవసాయ అధికార మార్కు గ్లాడ్‌సన్‌, ఏఈవో అఖిల్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ గుండు తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-02-09T04:37:42+05:30 IST