ఐటీఐలో ప్రవేశాలకు గడువు పొడిగింపు
ABN , First Publish Date - 2021-10-23T05:15:31+05:30 IST
ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఆదిలాబాద్‌లో 2021-22 సంవత్సరంలో 3వ విడతలో ప్రవేశం కోసం గడువు పొడిగించినట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ సుజాత ఒక ప్రకటనలో తెలిపారు.
ఆదిలబాద్‌టౌన్, అక్టోబరు 22: ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఆదిలాబాద్‌లో 2021-22 సంవత్సరంలో 3వ విడతలో ప్రవేశం కోసం గడువు పొడిగించినట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ సుజాత ఒక ప్రకటనలో తెలిపారు. డైరెక్టర్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ హైదరాబాద్ వారి ఉత్తర్వుల మేరకు గడువును ఈ నెల 28 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్ చేసుకునేందుకు పొడిగించడం జరిగిందన్నారు. ఆగస్టు 2021, 2022 ఎన్‌సీవీటీపీ ప్యాటన్ కింద మూడో విడతలో వివిధ ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ ట్రేడులలో శిక్షణ పొందేందుకు అభ్యర్తుల నుంచి ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐలో ప్రవేశం కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడుతుందన్నారు. ఈ నెల 22 వరకు ఉన్న దరఖాస్తుల స్వీకరణ గడువును 28 వరకు పొడగించినందున అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరింత సమాచారం కోసం 8500747308, 9493535378 నెంబర్లకు సంప్రదించాలన్నారు.