ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలి

ABN , First Publish Date - 2021-05-03T03:52:48+05:30 IST

ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేసుకోవాలని అదనపుకలెక్టర్‌ రాజేశం అన్నారు.

ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలి
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ రాజేశం

- అదనపు కలెక్టర్‌ రాజేశం

కెరమెరి, మే 2: ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేసుకోవాలని అదనపుకలెక్టర్‌ రాజేశం అన్నారు. ఆదివారం మండలంలోని సాకడలో గోం డ్వానా పంచాయతీ రాయిసెంటర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి హాజరై మాట్లాడారు. కరోనా వైరస్‌ రెండో దశ విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలన్నారు. టీకా తీసుకో వడంతోనే వైరస్‌ను సమూలంగా నిర్మూలించవచ్చ న్నారు. అనంతరం ఎమ్మెల్యే సక్కు మాట్లాడుతూ ఎలాంటి భయాందోళన లేకుండా ప్రతిఒక్కరు టీకా తీసుకుని కరోనా నిర్మూలనకు పాటుపడాలని పేర్కొ న్నారు. టీకాలు అందరూ తీసుకున్నట్లయితే కరో నాను కట్టడిచేయవచ్చన్నారు. కార్యక్రమంలో గ్రంథా లయ చైర్మన్‌ యాదవ్‌రావు, ఎంపీపీ మోతీరాం, అడిష నల్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుధాకర్‌నాయక్‌, నాయ కులు దేవ్‌రావు, లక్ష్మణ్‌, బొజ్జిరావు, సర్పంచ్‌ కాసు బాయి, ఎంపీడీవో దత్తా రాం, ఎంపీవో మహేందర్‌ రెడ్డి, పలుగ్రామాల నుంచి వచ్చిన గిరిజనులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-03T03:52:48+05:30 IST