అధికారమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలి
ABN , First Publish Date - 2021-01-20T05:40:01+05:30 IST
రానున్న కాలంలో రాష్ట్రంలో అధికా రంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ప్రతి ఒక్క కార్యకర్త సైనికునిలా పనిచేయాలని ఎంపీ సోయం బాపూరావు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్‌లో ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఆదిలాబాద్ అర్బన్, జనవరి 19: రానున్న కాలంలో రాష్ట్రంలో అధికా రంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ప్రతి ఒక్క కార్యకర్త సైనికునిలా పనిచేయాలని ఎంపీ సోయం బాపూరావు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్‌లో ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడుతున్న దృష్ట్యా టీఆర్‌ఎస్‌లో వణుకుపుడు తుందని అందుకని ఆ పార్టీ నాయకులు బీజేపీ నాయకులను భయ బ్రాంతులకు గురి చేసేందుకు దాడులకు ఉపక్రమిస్తూ పోలీసులతో కొట్టిస్తు న్నారని విమర్శించారు. రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్‌లు కాలగర్భంలో కలిసి పోయాయని, టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ పోటీ బీజేపీనేనని, ప్రతీ కార్యకర్త కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పథకాలకు నిధులు అందజేస్తే ఆ పనులకు రాష్ట్ర ప్రభుత్వ బొమ్మలు వేస్తున్నారని దీనిని ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త అడ్డుకోవాలన్నారు. నరేంద్రమోదీ ప్రధా నమంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ యావత్ ప్రపంచానే భారతదేశంపై దృష్టిపడేలా చేస్తున్నారని కరోనా వ్యాక్సిన్ ప్రపంచాన్ని కళ్లు తెరపించేలా దేశంలో తయారు చేయించారని హైదరాబాద్‌లో కరోనా వ్యాక్సిన్ తయారు చేయించి దానిని పర్యవేక్షించే వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం తెలియదని ఆ పై కరోనా వ్యాక్సిన్ ప్రారంభోత్సవానికి కేసీఆర్ చిత్రపటాలు వేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. అనంతరం రాష్ట్ర అధికార ప్రతినిధి అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ర్టాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని, రూ.68 కోట్ల మిగులు బడ్జెట్‌ను నాలుగున్నర లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. అభివృద్ధి పథకాలపై అంచనాలు పెంచుకుంటూ కేసీఆర్ కుటుంబం పూర్తిగా రాష్ర్టాన్ని దోచుకుంటుందని దుయ్యబట్టారు. అనం తరం బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల శంకర్ మాట్లాడుతూ అయోధ్యలో రామాలయ నిర్మాణానికి వీహెచ్‌పీ చేస్తున్న కృషికి కార్యకర్తలందరు సహకరించాలని కోరారు. ఇందులో బీజేపీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, నాయకులు ఆడే మానాజి, అంకత్ రమేష్, మురళీధర్‌తో పాటు జిల్లాలోని పలు మండలాల జడ్పీటీసీలు, మండలాల అధ్యక్షులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, పార్టీ పదాధికారులు పాల్గొన్నారు.