వైభవంగా జగదాంబదేవి విగ్రహ ప్రతిష్ఠాపన

ABN , First Publish Date - 2021-12-19T06:03:28+05:30 IST

ఖానా పూర్‌ మండలంలోని మారుమూల గిరిజన గ్రామం అయిన చందునాయక్‌ తండాలో శనివారం జగదాంబదేవి అమ్మ వారి, సేవాలాల్‌ మహరాజ్‌ విగ్రహ ప్రతి ష్ఠాపన మహోత్సవం శనివారం వైభవంగా జరిగింది.

వైభవంగా జగదాంబదేవి విగ్రహ ప్రతిష్ఠాపన
అలంకరణలో అమ్మవారు

ఖానాపూర్‌ రూరల్‌, డిసెంబరు 18 : ఖానా పూర్‌ మండలంలోని మారుమూల గిరిజన గ్రామం అయిన చందునాయక్‌ తండాలో శనివారం జగదాంబదేవి అమ్మ వారి, సేవాలాల్‌ మహరాజ్‌ విగ్రహ ప్రతి ష్ఠాపన మహోత్సవం శనివారం వైభవంగా జరిగింది. యంత్ర ప్రతిష్ఠ, కళ్యాన్యాసము, ప్రాణప్రతిష్ట, అమ్మ వారి విశ్వరూప సంద ర్శనం, పంచామృతాభిషేకం, జలాధివాసం, హోమం అర్చకుల వేదమంత్రాల మధ్య ఘనంగా నిర్వహించారు.  ఆల్‌ఇండియా బం జారా సేవాసంఘం తెలంగాణ రాష్ట్ర అధ్య క్షులు, టీజీవో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్యామ్‌నాయక్‌, మాజీ జడ్‌పీటీసీ రాథోడ్‌ రామునాయక్‌ పాల్గొని ప్రత్యేకపూజలు నిర్వహించారు. లింబాజీ మహ రాజ్‌ ప్రవచనాలు చేసారు. ప్రతిఒక్కరు మంచిమార్గంలో నడవాలని అన్నారు. సర్పంచ్‌ గుగ్లావత్‌ బద్దిబాయి, గ్రామకమిటీ అఽధ్యక్షులు నిమ్యా నాయక్‌లు, ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఇబ్బంది కలుగకుండా తగిన ఏర్పాట్లు చేసారు. కార్యక్రమానంతరం అన్నదానం నిర్వహించారు. ఆయా గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించు కున్నారు.

Updated Date - 2021-12-19T06:03:28+05:30 IST