శిక్షణల ద్వారా ఉపాధి : ఐటీడీఏ పీవో

ABN , First Publish Date - 2021-11-23T05:39:39+05:30 IST

యూత్‌ ట్రేనింగ్‌ సెంటర్‌లలో ఇస్తున్న శిక్షణల ద్వారా గిరిజన యువత ఉపాధి పొందాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంకిత్‌ అ న్నారు. సోమవారం స్థానిక కుమ్రం భీం ప్రాంగణంలోని యూత్‌ ట్రేనింగ్‌ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి శిక్షణ పొందుతున్న యువతి, యువకులతో మాట్లాడారు.

శిక్షణల ద్వారా  ఉపాధి : ఐటీడీఏ పీవో
శిక్షణ పొందుతున్న యువతులకు దుస్తులు పంపిణీ చేస్తున్న పీవో అంకిత్‌

ఉట్నూర్‌, నవంబరు 22: యూత్‌ ట్రేనింగ్‌ సెంటర్‌లలో ఇస్తున్న శిక్షణల ద్వారా గిరిజన యువత ఉపాధి పొందాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంకిత్‌ అ న్నారు. సోమవారం స్థానిక కుమ్రం భీం ప్రాంగణంలోని  యూత్‌ ట్రేనింగ్‌ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి శిక్షణ పొందుతున్న యువతి, యువకులతో మాట్లాడారు. కంప్యూటర్‌ అండ్‌ మార్కెటింగ్‌ శిక్షణ పొందుతున్న వారు సక్రమంగా శిక్షణ పొందాలని, శిక్షణ అనంతరం ఊరికే ఉండకుండా  ఉపాది పొందేలా  చూసుకోవాలన్నారు. ఇప్పటి వరకు వైటీసీ ద్వారా ఇచ్చిన శిక్షణల అనంతరం ప్లెస్‌మెం ట్‌ తీసుకోని ఎంత మంది ఉద్యోగాలు చేస్తున్నారని వైటీసీ జేడీఎం నాగభూషనాన్ని ప్రశ్నించారు. శిక్షణ పొందుతున్న యువతీ, యువకుల కు కంపెనీల ద్వారా ప్లేస్‌మెంట్‌ ఇప్పిస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా 40 మంది శిక్షణ పొందుతున్న యువతీ, యువకులకు యూనిఫాం, షూస్‌, అందించారు. ఈ కార్యక్రమంలో అనీల్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-23T05:39:39+05:30 IST