విద్యుత్ ఉద్యోగులకు రక్షణ కల్పించాలి
ABN , First Publish Date - 2021-12-10T03:47:53+05:30 IST
విద్యుత్ శాఖ ఉద్యోగు లకు రక్షణ కల్పించాలని ఉద్యోగుల జేఏసీ సభ్యు లు పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయం ఆవర ణలో విధులు బహిష్కరించి చెన్నూరు సబ్ స్టేష న్‌లో విద్యుత్ సిబ్బందిపై జరిగిన దాడికి నిరస నగా చేపట్టిన ధర్నాలో పాల్గొన్నారు

ఏసీసీ, డిసెంబరు 9: విద్యుత్ శాఖ ఉద్యోగు లకు రక్షణ కల్పించాలని ఉద్యోగుల జేఏసీ సభ్యు లు పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయం ఆవర ణలో విధులు బహిష్కరించి చెన్నూరు సబ్ స్టేష న్‌లో విద్యుత్ సిబ్బందిపై జరిగిన దాడికి నిరస నగా చేపట్టిన ధర్నాలో పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులపై పెట్టిన అక్రమ అట్రాసిటీ కేసును ఎత్తివేయాలని, ఉద్యోగులపై దాడికి పాల్పడిన చెన్నూరు మున్సి పల్ కౌన్సిలర్లపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెన్నూరు సబ్‌స్టేషన్ భూమిని ఎన్‌పీడీసీఎల్ యాజమాన్యం కాపాడాలని, విద్యు త్ ఉద్యోగులకు ప్రాణరక్షణ కల్పించాలన్నారు. తమ నిరసనకు స్పందనగా ఎన్‌పీడీసీఎల్ యాజ మాన్యం చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌ను సంప్రదింపు లకు పంపించారన్నారు. చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దృష్టికి సమస్యలను తీసుకువెళ్లనున్నట్లు తెలి పారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు నిర సన కొనసాగుతుందని స్పష్టం చేశారు. నాయ కులు రాము, రాజేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.