తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2021-03-15T05:08:40+05:30 IST

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తామని మున్సిపల్‌ చైర్మన్‌ జోగుప్రేమేందర్‌ అన్నారు.

తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి

ఆదిలాబాద్‌టౌన్‌, మార్చి14: ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తామని మున్సిపల్‌ చైర్మన్‌ జోగుప్రేమేందర్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీచర్స్‌ కాలనీలో మిగిలి పోయిన మిషన్‌ భగీరథ పనులకు మున్పిల్‌ చైర్మన్‌ భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌లో విలీనమైన కాలనీల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పట్టణంలో 49 వార్డుల్లో సుమారు 52కి.మీల మేరకు మిషన్‌ భగీరథ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ పనులు మార్చి చివరి లోపు పూర్తి చేసి ఏప్రిల్‌ 1 నుంచి పట్టణంలోని ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తామన్నారు. ఇందులో కౌన్సిలర్‌ కృష్ణ, నాయకులు బండారివామన్‌, రాజ్‌కుమార్‌, కాలనీ వాసులున్నారు.

Updated Date - 2021-03-15T05:08:40+05:30 IST