పైలేరియా నివారణకు కృషిచేయాలి

ABN , First Publish Date - 2021-07-11T05:06:40+05:30 IST

పైలేరియా నివార ణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని జిల్లా వైద్యాధి కారి కుడ్మెత మనోహర్‌ అన్నారు.

పైలేరియా నివారణకు కృషిచేయాలి
మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో మనోహర్‌

- డీఎంహెచ్‌వో మనోహర్‌

ఆసిఫాబాద్‌, జూలై 10: పైలేరియా నివార ణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని జిల్లా వైద్యాధి కారి కుడ్మెత మనోహర్‌ అన్నారు. శనివారం తన ఛాంబర్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమా వేశంలో అయన మాట్లాడుతూ జిల్లాలో వ్యాధిని అరికట్టేందుకు ఈనెల15నుంచి 17వరకు సామూ హిక మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిం చనున్నట్లు అయనతెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 830మంది పైలేరియాతో బాధపడుతున్నట్లు అయన పేర్కొన్నారు. వ్యాధిని నియంత్రించేం దుకు డైఈథైల్‌ కార్బోమెజైన్‌ సిట్రెట్‌(డీఈసీ), అల్బెం డాజోల్‌ మాత్రలను పంపిణీ చేపడతామన్నారు. జిల్లాలో 5,13,089మందికి మూడురోజులపాటు ఇంటిం టతిరిగి వైద్యసిబ్బంది ఈమాత్రలను పంపిణీ చేస్తార న్నారు. కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ సుధాకర్‌నాయక్‌, వైద్యాధికారులు సత్యనారాయణ, సీతారాం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-11T05:06:40+05:30 IST