దిందావాగుపై వంతెన నిర్మాణానికి కృషిచేయాలి

ABN , First Publish Date - 2021-12-31T03:48:25+05:30 IST

మండ లంలోని దిందా-కేతిని గ్రామాల మధ్య హై లెవల్‌ వంతెన నిర్మా ణానికి కృషిచేయాలని దిందా గ్రామానికి చెందిన యువకులు బీజేపీ రాష్ట్రకార్య వర్గసభ్యుడు డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస్‌తో కలిసి ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావుకు వినతి పత్రం అందజేశారు.

దిందావాగుపై వంతెన నిర్మాణానికి కృషిచేయాలి
ఎంపీ సోయం బాపూరావుకు వినతిప్రతం ఇస్తున్న గ్రామస్థులు

 చింతలమానేపల్లి, డిసెంబరు 30: మండ లంలోని దిందా-కేతిని గ్రామాల మధ్య హై లెవల్‌ వంతెన నిర్మా ణానికి కృషిచేయాలని దిందా గ్రామానికి చెందిన యువకులు బీజేపీ రాష్ట్రకార్య వర్గసభ్యుడు డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస్‌తో కలిసి ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దిందావాగుపై హైలెవల్‌ వంతెన నిర్మాణం లేకపోవడంతో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. వంతెన నిర్మాణానికి కృషిచేసి గ్రామస్థుల ఇబ్బందులు తొలగేలా చూడాలని పేర్కొన్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు ధోని శ్రీశైలం, బీజేపీ మండల నాయకులు డోకె రామన్న, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T03:48:25+05:30 IST