దివ్యాంగుల సంక్షేమానికి కృషి

ABN , First Publish Date - 2021-12-04T03:33:25+05:30 IST

దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్‌ పేర్కొన్నారు. శుక్రవారం అంతర్జాతీ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌ రైతువేదికలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

దివ్యాంగుల సంక్షేమానికి కృషి
ఆసిఫాబాద్‌లో దివ్యాంగులను సన్మానిస్తున్న జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్‌

ఆసిఫాబాద్‌ రూరల్‌, డిసెంబరు 3: దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్‌ పేర్కొన్నారు. శుక్రవారం అంతర్జాతీ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌ రైతువేదికలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమపథకాలు అర్హులైన వారందరికీ అందేలా చూస్తామన్నారు.దివ్యాంగులుఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలన్నారు. అనంతరం పలువురు దివ్యాంగ నాయ కులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. కార్యక్ర మంలో డీడబ్ల్యూవో సావిత్రి, జిల్లాఎస్సీ అభివృద్ధి అధి కారి సజీవన్‌, ఆర్టీసీ డిపో సహాయ మేనేజర్‌ దేవపాల, వైద్యాధికారి సత్యనారాయణ, ఏపీడీరామకృష్ణ, దివ్యాంగ సంఘం నాయకులు రవిశంకర్‌, ఇస్లాంబీన్‌ హసన్‌, అనీల్‌,వెంకటేష్‌,స్వరూప,రబ్బానీ, పాల్గొన్నారు.

కౌటాల: మండలకేంద్రంలోని ప్రాథమిక పాఠశా లలో శుక్రవారం అంతర్జాతీ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రాంనాయక్‌, ఎంఈవో, వీఆర్వో, ఐఈఆర్పీ తదితరులు పాల్గొన్నారు.

తిర్యాణి: మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో శుక్రవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా తహసీ ల్దార్‌ మల్లికార్జున్‌, ఎంపీడీవో మహేందర్‌ మాట్లాడుతూ అంగ వైకల్యం ఎవరికీ శాపం కారాద న్నారు.ఆత్మవిశ్వాసంతో అద్భుతాలు సాధించినవాళ్లు ఎందరో ఉన్నారని వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని విద్యార్థులకు సూచించారు. ఐఈ ఆర్పీలు కుమార్‌, సుమన్‌ పాల్గొన్నారు. 

రెబ్బెన: మండల కేంద్రంలోని గోలేటి టౌన్‌షిప్‌లో ఎంపీడీఆర్‌ వికలాంగుల కార్యాలయంలో వికలాంగుల దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా వికలాంగుల గౌరవాధ్యక్షుడు గోపాలకృష్ణ, మండ లాధ్యక్షుడు జేబీవినోద్‌, సర్పంచ్‌రవినాయక్‌, తదిత రులు కేక్‌కట్‌ చేశారు. సుబ్బారావు, భరత్‌, రమేష్‌, రాజేష్‌, ప్రభాకర్‌, తిరుపతి,సావిత్రి, కార్యదర్శి తిరుపతి, మల్లేష్‌ పాల్గొన్నారు. సేవాఆధ్వర్యంలో కూడా వికలాం గుల దినోత్సవాన్ని నిర్వహించారు. సేవాఅధ్యక్షురాలు రాధాకుమారి మాట్లాడుతూ సింగరేణి యజమాన్యం, సేవాఆధ్వర్యంలో వారికి తగిన సహకారాలు అందిస్తా మన్నారు.ఈసందర్భంగా దివ్యాంగులకు ఆటలపోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానంచేశారు. డిప్యూటీ పర్సనల్‌ మేనేజర్‌ తిరుపతి, కిరణ్‌,సుజాత,భాస్కర్‌, పీఈటీ,తదితరులు పాల్గొన్నారు.

జైనూర్‌: స్థానిక జడ్పీసెకండరీ ఉన్నతపాఠశా లలో శుక్రవారం వికలాంగుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్భంగా మండల విద్యాధికారి కుడ్మెత సుధాకర్‌ విద్యార్థులకు బహుమతులు పంపిణీచేశారు. మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాల యంలో వికలాంగులైన సంపంగి, హన్మంతును శాలువాలు కప్పి సన్మానించారు. ఏఐఈ అర్పీలు స్వప్న, అనురాధ, హెచ్‌ఎం జాదవ్‌రమేష్‌, మండల సమాఖ్య అధ్యక్షురాలు కొడప మోతుబాయి ఉన్నారు.

Updated Date - 2021-12-04T03:33:25+05:30 IST