సీనియారిటీ జాబితాపై సందేహాలు

ABN , First Publish Date - 2021-12-25T05:55:01+05:30 IST

గత పది రోజుల నుంచి సా గుతున్న టీచర్ల విభజన వ్యవహారమంతా గందరగోళంగా కొనసాగిందన్న ఆరోపణలున్నాయి.

సీనియారిటీ జాబితాపై సందేహాలు

అధికారుల తీరుపై అనుమానాలు 

చివరి వరకు జిల్లాలో ఉత్కంఠ 

ఆగమేఘాలపై ఉత్తర్వులు 

నిర్మల్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి)  : గత పది రోజుల నుంచి సా గుతున్న టీచర్ల విభజన వ్యవహారమంతా గందరగోళంగా కొనసాగిందన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా సీనియారిటీ జాబితాల తయారీపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయన్న ఫిర్యాదులు వస్తున్నాయి. గురు వారం వరకు సీనియార్టీ జాబితాలపై ఫిర్యాదుల పరంపర కొనసాగడం సందేహాలకు తావిస్తోంది. కొంతమంది యూనియన్‌ నాయకులు, సంబంధిత అధికారుల తీరుపైనా పలువురు టీచర్లు మండిపడుతున్నారు. చివ రి వరకు జాబితా సవరణ, జాబితాలో తప్పుల సవరణల పేరిట హైడ్రా మా కొనసాగించారన్న ప్రచారం జరుగుతోంది. యూనియన్‌ నాయకుల ఫిర్యాదులు, ఒత్తిళ్ల కారణంగా అధికారులు సీనియార్టీ జాబితా సవరణకు అవకాశం కల్పించాలంటున్నారు. దీనిని సాకుగా తీసుకొని కొంతమంది సీనియార్టీలో సవరణలు చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రా త్రింబవళ్ళు ఈ ప్రక్రియ సాగడంతో అర్హతలు, సీనియారిటీ ఉన్న వారికి సరియైున సమాచారం అందుబాటులో లేకుండా పోయిందంటున్నారు. ఎస్‌జీటీల జాబితాతో పాటు పలు సబ్జెక్టుల స్కూల్‌ అసిస్టెంట్‌ల సీనియారిటీ జాబితాను వారు జారీచేయడంతో అయోమయ పరిస్థితులు త లెత్తాయంటున్నారు. ముఖ్యంగా అధికారులు, సిబ్బంది మధ్య సమన్వ యం లోపించడంతో ఈ ప్రక్రియంతా ఆలస్యంగా సాగిందన్న వాదనలున్నాయి. ఇతర జిల్లాల్లో పకడ్భందీగా ప్రక్రియనంతా ఇప్పటికే ముగిసినప్పటికి జిల్లాలో మాత్రం శుక్రవారం మధ్యాహ్నం వరకు కూడా జిల్లాల కేటాయింపుల ప్రక్రియ కొనసాగడం సందేహాలకు బలం చేకూరుస్తోంది. కొంతమంది నాయకులు అలాగే సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శించి అర్హులైన సీనియర్‌లకు నష్టం చేకూర్చారన్న ప్రచారం జరుగుతోంది. ఆది లాబాద్‌ జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయంలో తిష్టవేసిన కొంతమంది చక్రం తిప్పి సీనియార్టీ జాబితాలోని చిన్నచిన్న పొరపాట్లను సాకుగా చూపి అంతా తలకిందులు చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనూహ్యంగా స్థానికత వ్యవహారాన్ని తెరపైకి తెచ్చిన ప్రభుత్వం పుట్టి పెరిగిన సొంత జిల్లాల నుంచి వేరు చేస్తూ సీనియార్టీ ప్రతిపాదికన పొరుగు జిల్లాలకు బలవంతంగా  పంపుతుండడం పట్ల అంతటా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ తీరు కారణంగా పుట్టి పెరిగిన సొంత ప్రాంతాన్ని వదులుకొని ఇతర చోట్ల స్థానికేతరులుగానే తాము మిగిలిపోవాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభు త్వం తమను బలవంతంగా బయటకు పంపి పొరుగు జిల్లాలో స్థానికులుగా ముద్ర వేస్తున్నప్పటికీ నైతికంగా మాత్రం తమను అక్కడి జిల్లాల ప్రజలు, ఉద్యోగులు మాత్రం స్థానికులుగా గుర్తించరని వాపోతున్నారు. కేవలం పదిరోజుల్లోనే ప్రక్రియనంతా యుద్ద ప్రాతిపాదికన చేపట్టి తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా జిల్లాల బదిలీ వ్యవహారాన్ని చేపట్టడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. 

సీనియారిటీ జాబితాపై సందేహాలు

దీంతో పాటు స్కూల్‌ అసిస్టెంట్‌ల సీనియార్టీ జాబితా రూపకల్పనపై చాలా మంది టీచర్లు విమర్శిస్తున్నారు. ఒక్కొ జాబితాను నాలుగైదు సా ర్లు సవరణల పేరిట మార్పులు చేయడం, అలాగే కొంతమంది యూని యన్‌ నాయకులు తమ చేతివాటం ప్రదర్శించి అనుకూలమైన వ్యక్తుల కోసం జాబితాను తలకిందులు చేశారన్న ఆరోపణలున్నాయి. సాంకేతిక లోపాలను వీరు తమకు అనుకూలంగా మలుచుకొని సీనియార్టీ జాబితాలో తప్పిదాలకు పాల్పడ్డారన్న వాదనలున్నాయి. జిల్లాల కేటాయింపు, జాబితాల రూపకల్పన ప్రక్రియ ఆలస్యం కావడంతో చివరి సమయంలో అనేక అవకతవకలు జరిగాయన్న ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం నుంచి ఈ ప్రక్రియ ఆలస్యంపై ఒత్తిడి పెరగడంతో అధికారులు హడావిడిగా కేటాయింపుల ప్రక్రియను చేపట్టారని, దీని కారణంగా అర్హులైన సీనియర్‌లకు అన్యాయం జరిగిందన్న వాదనలు తలెత్తుతున్నాయి. 

సీనియారిటీ లెక్కింపుపై విమర్శలు

కాగా టీచర్ల సీనియారిటీ వ్యవహారంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల్లోని సీనియారిటీ వ్యవహారంలో ముఖ్యంగా పదోన్నతి పొందిన టీచర్ల సీనియార్టీని ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకోవడం సమంజసం కాదని, ఎస్‌జీటీలుగా ఉద్యోగం పొందిన నాటి నుంచే సర్వీసును సీనియార్టీగా పరిగణించాలే తప్ప ప్రమోషన్‌ తేదీని సీనియారిటీగా లెక్కించవద్దని మొదటి నుంచి టీచర్లు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఉపాఽధ్యాయుల ఎస్‌జీటీ నియామక తేదీని పట్టించుకోకుండా ప్రమోషన్‌ పొందిన తేదీనే సీనియారిటీగా పరిగణించడంతో చాలా మంది సీనియర్‌ ఉపాధ్యాయులు దూర ప్రాంతాల్లో ఉన్న పొరుగు జిల్లాలకు బలవంతంగా బదిలీ అయ్యారంటున్నారు. తమకన్నా సర్వీసులో సీనియర్‌లుగా ఉన్న వారంతా సీనియారిటీ జాబితాలో ముందు వరసలో నిలవగా తామూ సీనియర్లమైనప్పటికీ జాబితాలో వెనక వరుసన ఉండిపోవాల్సి వచ్చిందని, దీంతో సొంత జిల్లా కేటాయింపుకు దూరమయ్యామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మూడు రోజులే గడువు

కాగా ప్రభుత్వం కొత్తజిల్లాలకు కేటాయించిన ఉద్యోగులు, టీచర్లందరిని మూడు రోజుల్లోనే వారికి కేటాయించిన జిల్లాల్లో రిపోర్టు చేయాలని ఆదేశించడంతో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం వరకు చాలా మంది టీచర్లకు జిల్లాల కేటాయింపు ఉత్త ర్వులు అందలేదంటున్నారు. అలాగే శని, ఆదివారాలు క్రిస్టమస్‌ సెలవులుగా ఉన్న కారణంగా చాలా మంది టీచర్లు తమ సొంత ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఈ దశలో బదిలీ ఉత్తర్వులు పట్టుకొని పొరుగు జిల్లాలకు పరుగు తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం టీచర్ల స్థానికత విషయంలో పునరాలోచించి వారి సొంత జిల్లాల్లోనే సీనియార్టీ ఆధారంగా కేటాయింపులు జరపాలని కోరుతున్నారు. 

Updated Date - 2021-12-25T05:55:01+05:30 IST