నేటి నుంచి ఇంటింటికీ జ్వర సర్వే

ABN , First Publish Date - 2021-08-20T06:45:39+05:30 IST

జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు నిర్మల్‌ పట్టణంలోని అన్నివార్డుల్లో 10 బృందాలతో ఇంటింటికీ జ్వరసర్వే, డ్రై డే నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ధనరాజ్‌ తెలిపారు.

నేటి నుంచి ఇంటింటికీ జ్వర సర్వే

నిర్మల్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు నిర్మల్‌ పట్టణంలోని అన్నివార్డుల్లో 10 బృందాలతో ఇంటింటికీ జ్వరసర్వే, డ్రై డే నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ధనరాజ్‌ తెలిపారు. వర్షాలు కురవడం వల్ల నీటినిల్వలు పెరిగి దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా, చికెన్‌ గున్యా వంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున నియంత్రణ, నివారణ చర్యల్లో భాగంగా సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, తమఇంటిలో, ఇంటిచుట్టూ నీరునిల్వ లేకుండా చూసుకోవాలని కోరారు. వైరల్‌ జ్వరాల వల్ల కూడా శరీరంలో ప్లేట్‌ లెట్స్‌సంఖ్య తగ్గుతుందని, జ్వరం రాగానే ఆందోళన పడకుండా నిర్ధారణ పరీక్షలు చేసుకుని చికిత్స పొందాలని కోరారు. 


Updated Date - 2021-08-20T06:45:39+05:30 IST