కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు విరాళాలు అందించాలి

ABN , First Publish Date - 2021-05-09T03:51:17+05:30 IST

కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ప్రతీ ఒక్కరు విరా ళాలు ఇవ్వాలని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు శనివారం అన్నారు. ఎమ్మె ల్యే నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తనవంతుగా రూ.2 లక్షలు విరాళం అందజేస్తున్నట్లు తెలిపారు.

కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు విరాళాలు అందించాలి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే దివాకర్‌రావు

ఏసీసీ, మే 8 : కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ప్రతీ ఒక్కరు విరా ళాలు ఇవ్వాలని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు శనివారం అన్నారు. ఎమ్మె ల్యే నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తనవంతుగా రూ.2 లక్షలు విరాళం అందజేస్తున్నట్లు తెలిపారు. మెడికల్‌ కిట్ల రూపంలో విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మందుల కిట్లను దాదాపు రూ.500లకు ఒక్కో కిట్‌ను అందిం చేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దాతలు అసోసియేషన్‌ నుంచి కిట్లను కొనుగోలు చేసి అందించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో రెమ్‌డెసివిర్‌, ఆక్సిజన్‌ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.  ప్రైవే టు ఆసుపత్రులలో రెమ్‌డెసివిర్‌ రూ.3500లకే అందించేలా చర్యలు చేపట్టా లని కోరామన్నారు. సిటీ స్కాన్‌ రూ.2500లకే చేయాలని కోరామని, అందుకు  అంగీకరించారని పేర్కొన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ రాజయ్య, వైస్‌చైర్మన్‌ ముఖే ష్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భూమేష్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు సత్యం, నడిపల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ విజిత్‌రావు  పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-09T03:51:17+05:30 IST