యాసంగిలో వరిపంట వేయవద్దు

ABN , First Publish Date - 2021-12-09T03:30:59+05:30 IST

యాసంగిలో రైతులు వరిసాగు చేయవద్దని ఏఈవోకవిత అన్నారు. బుధ వారం మండలకేంద్రంలోని గోవింద్‌పూర్‌కాలనీలో అధికా రులతో కలిసి పోస్టర్లను విడుదలచేశారు.

యాసంగిలో వరిపంట వేయవద్దు
సిర్పూర్‌(టి)లో క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న ఏఈవో, నాయకులు

సిర్పూర్‌(టి), డిసెంబరు 8: యాసంగిలో రైతులు వరిసాగు చేయవద్దని ఏఈవోకవిత అన్నారు. బుధ వారం మండలకేంద్రంలోని గోవింద్‌పూర్‌కాలనీలో అధికా రులతో కలిసి పోస్టర్లను విడుదలచేశారు. అలాగే వేం పల్లి, చింతకుంట, చీలపల్లి, కర్జెపల్లి గ్రామాల్లో ఏఈవోలు శ్రీనివాస్‌, నేహాతబస్సుం, శోభ అవగాహన కల్పించారు. 

పెంచికలపేట: మండలంలోని ఎల్కపల్లి, బొంబా యిగూడ, ఎల్లూరు, ఆగర్‌గూడ,పెంచికలపేట గ్రామాల్లో ఏడీఏ రాజులనాయుడు, ఏఈవోలుప్రేమలత, గౌసియా, శ్రీవిద్య అవగాహన కల్పించారు.

Updated Date - 2021-12-09T03:30:59+05:30 IST