దళితబస్తీ పట్టాపాసు పుస్తకాల పంపిణీ

ABN , First Publish Date - 2021-08-20T06:46:30+05:30 IST

మండలంలోని హంపోలి గ్రామంలో ఇటీవలే దళిత బస్తీపథకం కింద దళితులకు భూములను అందించారు.

దళితబస్తీ పట్టాపాసు పుస్తకాల పంపిణీ
పట్టాపాసు పుస్తకాలు అందజేస్తున్న అధికారులు

కుభీర్‌, ఆగస్టు 19 : మండలంలోని హంపోలి గ్రామంలో ఇటీవలే దళిత బస్తీపథకం కింద దళితులకు భూములను అందించారు. ఆ భూమిని సంబంఽ దించిన పట్టాపాసు పుస్తకాలను బుధవారం తహసీల్దార్‌ ప్రభాకర్‌రెడ్డి నాయ కులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యదర్శి తూం రాజేశ్వర్‌ మాట్లాడారు. నిరుపేద దళితుల అభివృద్ధి కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితబస్తీ పథకం ప్రవేశ పెట్టి భూములను అందజేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎన్నిల అనీల్‌, సంజయ్‌, ఆర్‌ఐ వెంకటరమణ, లబ్ధిదారులు తదితరులున్నారు. 

Updated Date - 2021-08-20T06:46:30+05:30 IST