విద్యార్థులకు మాస్కులు పంపిణీ
ABN , First Publish Date - 2021-03-22T04:47:51+05:30 IST
మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఆదివారం జడ్పీ చైర్‌పర్సన్ కోవలక్ష్మి తనయుడు కోవసాయి జన్మదినం పురస్కరించుకుని విద్యార్థులకు మాస్కులు పంపిణీ చేశారు.

తిర్యాణి, మార్చి21: మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఆదివారం జడ్పీ చైర్‌పర్సన్ కోవలక్ష్మి తనయుడు కోవసాయి జన్మదినం పురస్కరించుకుని విద్యార్థులకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవ సాయి నేతృత్వంలో మండలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంకూస్, హరీష్‌గౌడ్, సంతోష్, సాయి తదితరులు పాల్గొన్నారు.