పేదల భూములను లాక్కునేందుకే ధరణి

ABN , First Publish Date - 2021-10-30T03:44:29+05:30 IST

పేదల భూములను లాక్కుని తిరిగి భూస్వాములకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను రూపొందించిందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి తుల మధుసూధన్‌రావు అన్నారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ధరణి పోర్టల్‌ ప్రారంభించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా విజయోత్సవ వేడుక లను ప్రభుత్వం నిర్వహించిందని, కానీ ధరణి పోర్టల్‌ పూర్తిగా విఫలమైంద న్నారు. ధరణి పోర్టల్‌లో పట్టా భూములు ప్రభుత్వ భూములుగా, ప్రభుత్వ భూములు పట్టా భూములుగా పేర్కొన్నారన్నారు.

పేదల భూములను లాక్కునేందుకే ధరణి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న తుల మధుసూధన్‌రావు

ఏసీసీ, అక్టోబరు 29 : పేదల భూములను లాక్కుని తిరిగి భూస్వాములకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను రూపొందించిందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి తుల మధుసూధన్‌రావు అన్నారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ధరణి పోర్టల్‌ ప్రారంభించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా విజయోత్సవ వేడుక లను ప్రభుత్వం నిర్వహించిందని,  కానీ ధరణి పోర్టల్‌ పూర్తిగా విఫలమైంద న్నారు. ధరణి పోర్టల్‌లో పట్టా భూములు ప్రభుత్వ భూములుగా, ప్రభుత్వ భూములు పట్టా భూములుగా పేర్కొన్నారన్నారు. కొందరు భూముల సర్వే నెం బర్లు ధరణిలో మాయమయ్యాయని, సంవత్సరం గడిచినా సమస్య పరిష్కారం కాలేదని, రైతులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ధరణిలో సమస్యలు పరిష్కరించడంపై కలెక్టర్‌లకు సైతం అంతుపట్టడం లేదన్నారు. సమావేశంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి బోయిని హరికృష్ణ, పట్టణ ఉపాధ్యక్షుడు ప్రదీప్‌చంద్ర, ప్రభాకర్‌రావు, మల్లేష్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-30T03:44:29+05:30 IST