టీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో గ్రామాల అభివృద్ధి
ABN , First Publish Date - 2021-10-21T06:37:29+05:30 IST
మండలంలోని పెర్కపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించ తలపెట్టిన అదనపుగది నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే రేఖానాయక్ శంఖుస్థాపన చేశారు.
దస్తూరాబాద్, అక్టోబరు 20 : మండలంలోని పెర్కపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించ తలపెట్టిన అదనపుగది నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే రేఖానాయక్ శంఖుస్థాపన చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు మాస్కులను పంపిణీ చేశారు. అనంతరం మున్యాల్ తండాలోని జగదాంబ దేవాలయం ప్రాంగణంలో సీసీరోడ్డు, సెంట్రల్ లైటింగ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు ప్రతీ ఒక్కరూ దాసోహమవుతారని అన్నారు. గ్రామాల అభివృద్ధి టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరుగుతుందని అన్నారు. ప్రజల కోసం పలు రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి కేసీఆర్ ప్రజల్లో దేవుడిలాగా నిలిచారని అన్నారు. దేవాలయం ఆవరణలో మొక్కలునాటి నీరు పోశారు. సర్పంచ్ సురేష్‌నాయక్ ఎమ్మెల్యేను సన్మానించారు. ఇందులో ఎంపీపీ కిషన్, వైస్ ఎంపీపీ రాజునాయక్, సర్పంచ్ ప్రభాకర్ పాల్గొన్నారు.