టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం

ABN , First Publish Date - 2021-11-10T04:02:18+05:30 IST

టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండల కేంద్రంలోని ఆయన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మితో కలిసి మాట్లాడారు.

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం
పార్టీలోకి ఆహ్వానిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే కోనప్ప

- ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

కౌటాల, నవంబరు 9: టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు.  మండల కేంద్రంలోని ఆయన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మితో కలిసి మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ బుడుబుక్కల మాటలు మాట్లాడుతున్నారని, ప్రజలు ఈ మాటలు నమ్మేస్థితిలో లేరన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్‌ గురించి మాట్లాతే అర్హత సంజయ్‌కి లేదన్నారు. గతంలో కాగజ్‌నగర్‌ పర్యటనకు వచ్చిన సందర్భంగా తన వద్ద రూ.200 కోట్లు ఉన్నాయని ఆరోపించారని, అలా ఉంటే అధికారులతో సోదాలు చేయించి డబ్బులు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం 400 మంది కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరడంతో వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ కృష్ణారావు, గ్రంథా లయ చైర్మన్‌ యాదవ్‌రావు, డీజీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ మాంతయ్య, ఎంపీపీలు విశ్వనాథ్‌, నానయ్య, సర్పంచ్‌లు మౌనీష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-10T04:02:18+05:30 IST