హత్యకేసులో నిందితుడి రిమాండ్‌

ABN , First Publish Date - 2021-10-20T04:24:00+05:30 IST

మండలంలోని కర్జేపల్లి గ్రామానికి చెందిన గుర్లెశేఖర్‌(30)ను పాత కక్షలతో హతమార్చిన కేసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

హత్యకేసులో నిందితుడి రిమాండ్‌
వివరాలు వెల్లడిస్తున్న సీఐ రాజేంద్రప్రసాద్‌

సిర్పూర్‌(టి), అక్టోబరు 19: మండలంలోని కర్జేపల్లి గ్రామానికి చెందిన గుర్లెశేఖర్‌(30)ను పాత కక్షలతో హతమార్చిన కేసులు  నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.  కౌటాల ఇన్‌చార్జి సీఐ రాజేంద్రప్రసాద్‌, ఎస్సై రవికుమార్‌ మంగళవారం పోలీసుస్టేషన్‌ లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. మండలంలోని కర్జేపల్లి గ్రామానికి చెందిన గుర్లెశేఖర్‌ ఈనెల 13న ఇంటినుంచి అదృశ్యమ య్యాడు.  శేఖర్‌ భార్య గిరిజ భర్త అదృశ్యమైనట్లు ఆదివారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతని ఆచూకీ కోసం దర్యాప్తు జరిపారు. చివరికి శేఖర్‌, నిందితుడు చిలుకయ్య కాల్‌డేటా ఆధారంగా శేఖర్‌ హత్యకు గురైనట్లు నిర్ధారణకువచ్చారు. శేఖర్‌కు అతనిస్నేహితుడు చిలుకయ్యకు పాత కక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో అతన్ని కౌటాల మండలం గురుడుపేటకు పిలి పించిన చిలుకయ్య మరో ఐదుగురితో కలిసి ఎడ్లకొట్టంలో హత్యచేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహానికి రెండు సిమెంట్‌ పోళ్లు కట్టి కౌటాల మండలం కన్కి గ్రామంలోని వ్యవసాయ బావిలో పడ వేశారు. ఈ విషయమై చిలుకయ్యను విచారించగా హత్యచేసింది నిజమేనని ఒప్పుకున్నాడు.  చిలుకయ్యను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించామని సీఐ అన్నారు. హత్యకు సహకరించిన బి.కిష్టయ్య, ఎం.పోచయ్య, అర్జున్‌, గణేష్‌, శేఖర్‌ పరారీలో ఉన్నారని అన్నారు. త్వరలోనే మిగితా వారిని కూడా పట్టుకుంటామని తెలిపారు.

Updated Date - 2021-10-20T04:24:00+05:30 IST