అమలుకాని పథకాలపై ఎమ్మెల్యేను నిలదీయండి

ABN , First Publish Date - 2021-08-27T06:25:22+05:30 IST

అమలుకాని సంక్షేమ పథకాలను గుర్తుచేస్తూ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిని గ్రామస్థులు నిలదీయాలని కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు పవార్‌ రామారావుపటేల్‌ అన్నారు.

అమలుకాని పథకాలపై ఎమ్మెల్యేను నిలదీయండి
సమావేశంలో ప్రసంగిస్తున్న రామారావు పటేల్‌

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు పవార్‌రామారావుపటేల్‌

కుభీర్‌, ఆగస్టు 26 : అమలుకాని సంక్షేమ పథకాలను గుర్తుచేస్తూ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిని గ్రామస్థులు నిలదీయాలని కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు పవార్‌ రామారావుపటేల్‌ అన్నారు. గురువారం కుభీర్‌ మండల కేంద్రంలోని సంతోష్‌ జిన్నింగ్‌ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అథితిగా పాల్గొని కార్యకర్తలకు నాయకులకు దిశానిర్ధేశం చేశాడు. ముథోల్‌ నియోజకవర్గంలోని గ్రామాల్లో మొత్తం 12వేల వ్యవసాయ ఆధారిత నిరుపేద కుటుంబాలు ఉండగ ఇప్పటి వరకు కేవలం 120 కుటుంబాలకు మాత్రమే దళితబస్తీ కింద భూములను అందించారని అన్నారు.  కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర పరిశీలకులు కేశవ్‌రావు, భీంగౌడ్‌, కుంటాల ఎంపీపీ గజ్జారాం, భైంసా ఎక్స్‌మున్సిపల్‌ చైర్మన్‌ గంగాధర్‌ నాయకులు వడ్నం నాగేశ్వర్‌, ప్యాట లక్ష్మణ్‌, పార్టీ మండల కన్వీనర్‌ కందూర్‌ సాయినాథ్‌, మైనార్టీ మండల అధ్యక్షులు జావిద్‌ఖాన్‌, యూత్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షుడు సాయినాథ్‌, ముథోల్‌ నియోజకవర్గ మండలాల పార్టీ కన్వీనర్లు నాయకులు కార్యకర్తలు తదితరులున్నారు.


Updated Date - 2021-08-27T06:25:22+05:30 IST