గ్రామాల్లో ఊపందుకున్న దండారి సంబరాలు
ABN , First Publish Date - 2021-11-06T03:51:23+05:30 IST
దీపావళి పండుగను పుర స్కరించుకుని ఆదివాసిగ్రామాల్లో దండారి సంబ రాలు ఊపందుకున్నాయి. మండలంలోని జండాగూ, దుబ్బగూడ, ఉషేగాం, పవర్‌గూడ తదితర గ్రామాల్లో జడ్పీ చైర్‌పర్సన్ కోవలక్ష్మి ఏత్మసూర్ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

జైనూరు, నవంబరు 5: దీపావళి పండుగను పుర స్కరించుకుని ఆదివాసిగ్రామాల్లో దండారి సంబ రాలు ఊపందుకున్నాయి. మండలంలోని జండాగూ, దుబ్బగూడ, ఉషేగాం, పవర్‌గూడ తదితర గ్రామాల్లో జడ్పీ చైర్‌పర్సన్ కోవలక్ష్మి ఏత్మసూర్ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్పంచులు గేడాం వనిత, మేస్రం నాగోరావ్, మాజీ ఎంపీటీసీ మేస్రం మక్కు, మాజీ మార్కెట్ డైరెక్టర్ గేడాం లక్ష్మణ్, గ్రామ పటేల్ అనక రాంజీ ఉన్నారు.
లింగాపూర్: మాన్కుగూడలో ఆదివాసీలు గురు వారం దండారీఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుస్సాడీ తడోదాలను పూజించి నైవేధ్యం సమర్పించారు. గ్రామపటేల్ బారిరావు, సర్పంచ్ సుమలత, అనిల్ పాల్గొన్నారు.