అమ్మవారి సన్నిధిలో నృత్య ప్రదర్శన

ABN , First Publish Date - 2021-02-08T06:26:31+05:30 IST

జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర సరస్వతీ అమ్మ వారి సన్నిధిలో ఆదివారం మాలోత్‌ నవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలో నృత్యప్రదర్శన నిర్వహించారు.

అమ్మవారి సన్నిధిలో నృత్య ప్రదర్శన
బాసరలో నృత్య ప్రదర్శన ఇస్తున్న కళాకారులు

బాసర, ఫిబ్రవరి 7: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర సరస్వతీ అమ్మ వారి సన్నిధిలో ఆదివారం మాలోత్‌ నవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలో నృత్యప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రాష్ట్రాల నుంచి మొత్తం 180 మంది కళాకారులు, 40మంది నృత్య గురువులు పాల్గొన్నారు. గుంటూరు, విజయవాడ, వైజాగ్‌, కుచిపూడి, హైదారాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి, సిరిసిల్లా, తదితర ప్రాంతాల నుంచి కళాకారలు పాల్గొన్నారు. గత ఎనిమిది సంవత్సరాల నుంచి మాలోత్‌ నవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలో ప్రాచీన ప్రముఖ దేవాలయాల నందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది, ఇందులో భాగంగానే తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, అన్నవరం, విజయవాడ, వారణాసి, కాశీ, మధురై, హైదరాబాద్‌, షిర్డీ, తదితర ప్రదేశాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నట్లు ఆయన పేర్కొన్నాను. 

అమ్మవారిని దర్శించుకున్న జిల్లా మేజిస్ట్రేట్‌

బాసర సరస్వతీ అమ్మవారిని ఆది వారం జిల్లా మేజిస్ర్టేట్‌ హరీష్‌ కుటుంబ సమేతంగా దర్శించుకున్నా రు. ఆలయాధికారులు, అర్చకులు, పోలీసులు వీరిని ఘనంగా ఆలయా నికి ఆహ్వానించారు. అనంతరం ఆల యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు.

Updated Date - 2021-02-08T06:26:31+05:30 IST