అభివృద్ధిని ఓర్వలేకనే విమర్శలు

ABN , First Publish Date - 2021-02-06T05:20:53+05:30 IST

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతుంటే ఓర్వలేకనే ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని, ఇనే ళ్లూ నిద్రపోయారని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ విమర్శించారు.

అభివృద్ధిని ఓర్వలేకనే విమర్శలు
నూతన భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

ఉట్నూర్‌, ఫిబ్రవరి 5: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతుంటే ఓర్వలేకనే ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని, ఇనే ళ్లూ నిద్రపోయారని ఖానాపూర్‌ ఎమ్మెల్యే  రేఖానాయక్‌ విమర్శించారు. శుక్రవారం ఉట్నూర్‌ మం డలంలో ఉట్నూర్‌, తాండ్రలలో రూ.22.50 లక్షల వంతున మం జూరు చేసి నిర్మించిన రైతు వేది క భవనాలు ప్రారంభం అనం తరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో రైతులపై పోలీసులు లాఠీచార్జీ చేయడం హేయమైన చర్య అన్నారు.  రైతుల ప్రయోజనాల కోసం చెక్‌డ్యాంలు నిర్మించి రైతులకు సాగునీరుతో పాటు భూగర్భ జలాలు అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అనంతరం మండలంలోని ఐదుగురికి మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, వైస్‌ ఎంపీపీ దావులే బాలాజీ, సింగిల్‌ విండో చైర్మన్‌ ఎస్పీ రెడ్డి,  రైతు సమన్వయ కమిటీ చైర్మన్‌ అజిమొద్దీన్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సింగారే భరత్‌, కోఆప్షన్‌ సభ్యుడు రషీద్‌, మండల వ్యవసాయ అధికారి రాథోడ్‌ గణేష్‌, డిప్యూటీ ఈఈ శివగణేష్‌, ఏఈ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు

Updated Date - 2021-02-06T05:20:53+05:30 IST