జిల్లాలో నేరాలు తగ్గుముఖం పట్టాయి

ABN , First Publish Date - 2021-12-31T03:56:02+05:30 IST

జిల్లాలో గతేడాదితో పోలీస్తే ఈ యేడాది నేరాల సంఖ్య తగ్గిందని ఎస్పీ కె సురేష్‌కుమార్‌ అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన వార్షిక నేరసమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. శాంతిభద్రతల్లో భాగంగా మతాలు, కులాల మధ్య ఎటువంటి గొడవలు జరగ కుండా 2021సంవత్సరం అంతా పోలీసులు గ్రామసందర్శన, అవగాహన కల్పించ డంవల్ల సమస్యలు నిర్వీర్యం చేయగలినట్టు తెలిపారు.

జిల్లాలో నేరాలు తగ్గుముఖం పట్టాయి
మాట్లాడుతున్న ఎస్పీ కె సురేష్‌కుమార్‌

- వార్షిక నేరసమీక్షా సమావేశంలో ఎస్పీ కె సురేష్‌కుమార్‌

ఆసిఫాబాద్‌, డిసెంబరు 30 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలో గతేడాదితో పోలీస్తే ఈ యేడాది నేరాల సంఖ్య తగ్గిందని ఎస్పీ కె సురేష్‌కుమార్‌ అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన వార్షిక నేరసమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. శాంతిభద్రతల్లో భాగంగా మతాలు, కులాల మధ్య ఎటువంటి గొడవలు జరగ కుండా 2021సంవత్సరం అంతా పోలీసులు గ్రామసందర్శన, అవగాహన కల్పించ డంవల్ల సమస్యలు నిర్వీర్యం చేయగలినట్టు తెలిపారు. 2020లో మొత్తం3917కేసులు నమోదు కాగా, 2021లో మొత్తం2095కేసులు నమోదయ్యాయ న్నారు. మొత్తంమీద క్రైంరేటు 46.51శాతం తగ్గింద న్నారు. 2020లో మొత్తం 2955ఐపీసీ కేసులు నమోదు కాగా, 2021లో మొత్తం 1338నమోదయ్యాయన్నారు. మొత్తంగా 2021లో ఐపీసీ కేసులు 54.72శాతం తగ్గి నట్టు చెప్పారు. 2020లో మొత్తం జిల్లాలో 20హత్య కేసులు నమోదుకాగా, 2021లో 17 హత్యకేసులు నమోదైనట్టు వివరిం చారు. 

2020లో మొత్తం 127చోరీ కేసులు నమోదు కాగా 2021లో 87 నమోదు కాగా, ఇందులో 54కేసులను ఛేదించా మన్నారు. 75,48,658 విలువ గల నగదు, వస్తువులు దొంగిలించ బడగా అందులోంచి 22,59,873 విలువ గల నగదు వస్తువులను రికవరీ చేశామ న్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల కేసులు 11.93శాతం తగ్గినట్టు వివరిం చారు. జిల్లాలో ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో జాగ్ర త్తలు పాటించామని, రేడియం స్టిక్కరింగ్‌, స్పీడ్‌బ్రేకర్స్‌, గుంతలను పూడ్చటం తదితర కార్యక్రమాలను చేపట్టామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతిఒక్కరు తమకు సహకరించాలన్నారు.

Updated Date - 2021-12-31T03:56:02+05:30 IST