కొవిడ్‌ బాధితులు జాగ్రత్తలు పాటించాలి

ABN , First Publish Date - 2021-05-21T04:19:12+05:30 IST

కొవిడ్‌ బాధితులు జాగ్రత్తలు పాటిం చాలని అదనపు కలె క్టర్‌ రాజేశం అన్నారు.

కొవిడ్‌ బాధితులు జాగ్రత్తలు పాటించాలి
కరోనా వ్యాధి నుంచి కోలుకున్న వారితో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ రాజేశం

- అదనపు కలెక్టర్‌ రాజేశం

కెరమెరి, మే 20: కొవిడ్‌ బాధితులు జాగ్రత్తలు పాటిం చాలని అదనపు కలె క్టర్‌ రాజేశం అన్నారు. గురువారం ఆయన కెరమెరి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అధికా రులతో కొవిడ్‌-19పై సమావేశం నిర్వహిం చారు. అనంతరం అనార్‌పల్లి గ్రామంలో పర్యటించి ఇంటింటికీ తిరుగుతూ ఇటీవల నిర్వహించిన సర్వేలో భాగంగా మెడికల్‌ కిట్లు అందజేశారా అని బాధితులను అడిగి తెలుసుకున్నారు. కొవిడ్‌ వైరస్‌ రోజురోజుకు ఉధృతంగా వ్యాపిస్తున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. బాధితులకు ధైర్యం చెప్పి వారిలో మనోఽ దైర్యం కల్పించాలన్నారు. ప్రభుత్వం అందజేసే మాత్రలను క్రమం తప్పకుండా వాడాలన్నారు. కొవిడ్‌ కట్టడిలో గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ సిబ్బందితో పాటు అంగన్‌వాడీ, ఆశావర్కర్లు విశేషంగా పని చేస్తున్నారని వారిని అభినందించారు. తహసీల్దార్‌ సమీర్‌ అహ్మద్‌ఖాన్‌, ఎంపీడీవో దత్తారాం, వైద్యాధికారి సుంకన్న, సర్పంచ్‌ శేషారావు, అధికారులు ఉన్నారు.

Updated Date - 2021-05-21T04:19:12+05:30 IST