నకిలీ పత్తి విత్తనాల ముఠా అరెస్ట్
ABN , First Publish Date - 2021-05-21T04:16:24+05:30 IST
నకిలీ పత్తి విత్తనాల మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని ఆసిఫాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ, రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ అన్నారు.

-రూ.42లక్షల నిషేధిత విత్తనాలు, కారు స్వాధీనం
-రామంగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ
కాగజ్‌నగర్ టౌన్, మే 20: నకిలీ పత్తి విత్తనాల మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని ఆసిఫాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ, రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ అన్నారు. గురువారం కాగజ్‌నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాచారం మేరకు బుధవారం రాత్రి చింతలమానేపల్లి మండలంలోని గూడెం గ్రామ చుట్టుపక్కల ప్రాంతాల్లో టాస్క్‌ఫోర్స్, సివిల్, వ్యవసాయ శాఖాధికారులు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో 21క్వింటాళ్ల నిషేధితపత్తివిత్తనాలు, ముగ్గు రునిందితులు వెల్లంపల్లి సాంబశివరావు (గుంటూ రు), ప్రశాంత్(గూడెం), లంగరిభూపతి (తలాయి) లను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి స్విఫ్ట్ డిజైర్(టీఎస్ 09 6953)కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. తెలంగాణాలో రైతులు ఎక్కువగా పత్తి సాగుకు ప్రాధాన్యతనిస్తారని భావించిన దళారులు ఇదే అదునుగా భావించి అక్రమార్జన చేసేందుకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నారని ఎస్పీ పేర్కొన్నారు. కొంత మంది ముఠాలుగా ఏర్పడి అధిక డబ్బుల సంపాదన కోసం రహస్యంగా కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచిలాక్‌డౌన్ ఉన్న నేపథ్యంలో కొబ్బరి బొండాలు, నిత్యావరస సరుకుల వాహనాల్లో విత్తనాలసంచులు తరలిస్తున్నారన్నారు. బీటీ-3 రకం గ్లైసిల్ విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించినా దళారులు వాటిని పెద్ద మొత్తంలో తీసుకువచ్చి అంటగడుతున్నారన్నారు.
ఈ నకిలీ విత్తనాల ను కిలోకురూ. 2500 నుంచి రూ. 3000 విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులను మోసం చేస్తున్న 12మంది దళారులను ఇప్ప టికే అరెస్ట్ చేశామన్నారు. రైతుల సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో భవిష్యత్తులో మరికొంత మంది దళారులను పట్టుకుంటామన్నారు. అలాగే సుమారు 50మంది ముఠా సభ్యుల జాబితా సిద్దం చేసినట్లు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో కాగజ్‌నగర్ టౌన్ సీఐ మోహన్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్, ఏడీఏ రాజులనాయుడు తదితరులు పాలొన్నారు.