బరంపూర్‌లో 20 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-03-21T05:43:14+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహ్మమారి మరోసారి విజృంభించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మండలంలోని బరంపూర్‌ గ్రామంలో 20 మందికి కరోనా పాజిటివ్‌ రావడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజులుగా బరంపూర్

బరంపూర్‌లో 20 మందికి కరోనా

తలమడుగు, మార్చి 20: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహ్మమారి మరోసారి విజృంభించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మండలంలోని బరంపూర్‌ గ్రామంలో 20 మందికి కరోనా పాజిటివ్‌ రావడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజులుగా బరంపూర్‌ గ్రామంలో వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించగా గురువారం నలుగురికి, శుక్రవారం ఏడుగురికి, శనివారం తొమ్మిది మందికి కరోనా పాజిటివ్‌ రావడంతో వారిని ఐసోలేషన్‌కు పంపించడం జరిగిందని మండల వైద్యాధికారి డా.రాహుల్‌ తెలిపారు. అదే విధంగా గ్రామంలో కరోనా వ్యాప్తి చెందకుండా తగిన ఏర్పాట్లను చేస్తున్నామని సర్పంచ్‌ భగీరథబాయి, ఎంపీటీసీ రేణుకలు రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ కేదరేశ్వర్‌రెడ్డిలు తెలిపారు. ప్రతీఒక్కరు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ కరోనా నిబంధనలు పాటించాలని వారు సూచించారు. కాగా ఇటీవల కజ్జర్లలో ఆరుగురికి, తలమడుగు బీసీ హాస్టల్‌లో మరో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ రావడంతో మండల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని మండల అధికారులు సూచిస్తున్నారు.

Updated Date - 2021-03-21T05:43:14+05:30 IST