జిల్లాలో కరోనా కేసులు నిల్‌

ABN , First Publish Date - 2021-12-19T06:13:13+05:30 IST

జిల్లాలో శనివా రం కరోనా కేసులు నమోదు కాలేదని, నిల్‌ ఉన్నట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 298 మందికి పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అ యితే పరీక్షల్లో అనుమానితులైన ముగ్గురిని హోం ఐసోలేషన్‌కు, ఒకరిని రిమ్స్‌కు చికిత్స నిమిత్తం

జిల్లాలో కరోనా కేసులు నిల్‌

ఆదిలాబాద్‌ టౌన్‌, డిసెంబరు 18: జిల్లాలో శనివా రం కరోనా కేసులు నమోదు కాలేదని, నిల్‌ ఉన్నట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 298 మందికి పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అ యితే పరీక్షల్లో అనుమానితులైన ముగ్గురిని హోం ఐసోలేషన్‌కు, ఒకరిని రిమ్స్‌కు చికిత్స నిమిత్తం తరలించినట్లు పేర్కొన్నారు. ఒమైక్రాన్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందన్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులతో పాటు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కు ధరించాలని కోరారు.
49 వార్డుల్లో వ్యాక్సిన్‌ కేంద్రాలు
ఆదిలాబాద్‌ టౌన్‌, డిసెంబరు 18: పట్టణంలోని ప్రజల సౌలభ్యం కోసం ఈనెల 20నుంచి ప్రతి వార్డు లో 1నుంచి 49 వరకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సంబంధిత వైద్యాధికారులు తెలి పారు. సెప్టెంబరు కంటే ముందు, సెప్టెంబర్‌ నెలలో మొదటి డోసు వేసుకున్న వారందరూ రెండవ డోసును ఈ కేంద్రాలలో వేయించుకోవాలని తెలిపా రు. అదే విధంగా 18ఏళ్లు నిండిన అర్హులైన వారంద రు ఇంత వరకు కొవిడ్‌ టీకాను తీసుకోనట్లయితే అలాంటి వారు కూడా ఒకటవ డోసు టీకాను వేయించుకోవాలని కోరారు. పట్టణ ప్రజల సౌకర్యార్థం ఈ 49 వ్యాక్సిన్‌ కేంద్రాలతో పాటు వరో 3 వ్యాక్సిన్‌ కేంద్రాలను శిశుమందిర్‌ పాఠశాల, మార్వాడి ధర్మశాల,టీఎన్జీవోస్‌ భవనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. అందుకు రెండవ డోసు అర్హులైన వారు ఇంత వరకు వ్యాక్సిన్‌ వేసుకోలేని వారు కొవిడ్‌ వ్యాక్సిన్‌ను వేయించుకుని వైరస్‌ భారీన పడకుండా జాగ్రత్త పడాలని సూచించారు.

Updated Date - 2021-12-19T06:13:13+05:30 IST